ముస్తాబవుతున్న గువ్వ గోరింక
Monday, May 22, 2017 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
వినూత్నమైన సినిమాలకు పట్టం కడుతున్న తెలుగు ప్రేక్షకుల అభిరుచిపై నమ్మకంతో. ఆకార్ మూవీస్ సంస్థ ఓ వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో.. పూర్తి సహజమైన పాత్రలతో.. నిర్మిస్తున్న రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గువ్వగోరింక. సత్యదేవ్, ప్రియాలాల్, మధుమిత, ప్రియదర్శి, చైతన్య ప్రధాన తారాలు. రామ్‌గోపాల్ వర్మ శిష్యుడు మోహన్ బొమ్మిడి దర్శకత్వంలో దాము కొసనం, దళం జీవన్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం చిత్రీకరణ పూర్తిచేసుకొని, నిర్మాణానంతర పనులను జరుపుకుంటోంది.
ఈ సందర్భంగా నిర్మాతలు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ఇదొక ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీ, మానవ సంబంధాలు కనుమరుగవుతున్న ప్రస్తుత ప్రపంచంలో ఇద్దరు ప్రేమికుల మధ్య జరగిన సంఘటనలకు రూపమే గువ్వగోరింక. విభిన్న మనస్తత్వం కలిగిన ఇద్దరు ప్రేమికుల ఈ ప్రేమకథను దర్శకుడు ఎంతో ఆసక్తికరంగా తెరకెక్కించాడు. కొత్తతరహా సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులతో పాటు అన్ని వర్గాల వారికి నచ్చే చిత్రమిది అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: సురేష్ బొబ్బిలి, పాటలు: కందికొండ, కృష్ణకాంత్, మిట్టపల్లి సురేందర్, మాటలు: బజారా, మైల్స్ రంగస్వామి, కాస్ట్యూమ్స్: వినూత్న శత్రు, ఎడిటర్: గ్యారి బిహెచ్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments