విజయపథంలో గువ్వ గోరింక తొలిపాట
Wednesday, July 5, 2017 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
తొలిపాటతోనే మా గువ్వ గోరింక చిత్రం అటు టాలీవుడ్లో.. ఇటు సోషల్‌మీడియా వీక్షకుల్లో హాట్‌టాపిక్‌గా మారింది.ఈ మధ్య కాలంలో ఒక్క పాటతోనే అందరి మనసులు దోచుకున్న చిత్రంగా గువ్వ గోరింక అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది అంటున్నారు గువ్వ గోరింక నిర్మాతలు దాము రెడ్డి కొసనం, దళం జీవన్‌రెడ్డి. ఈ యువ నిర్మాతలు నిర్మిస్తున్న రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గువ్వగోరింక. సత్యదేవ్, ప్రియాలాల్, మధుమిత, ప్రియదర్శి, చైతన్య ప్రధాన తారాలు.
రామ్‌గోపాల్ వర్మ శిష్యుడు మోహన్ బొమ్మిడి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రం చిత్రీకరణ పూర్తిచేసుకొని, నిర్మాణానంతర పనులను జరుపుకుంటోంది. కాగా ఈ చిత్ర కథానాయకుడు సత్యదేవ్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రంలోని మిట్టపల్లి సురేందర్ సాహిత్యం అందించిన తినగా తినగా వగరు తీపి అని వేమన చెప్పేను అప్పుడు అంటూ కొనసాగే పాటను బుధవారం విడుదల చేశారు. ఈ పాటకు వస్తున్న స్పందన గురించి నిర్మాతలు మాట్లాడుతూ విడుదల చేసిన తొలిపాటకు మంచి స్పందన వస్తోంది. ఈ పాట వింటే ఒక్కసారిగా పాత రోజులు గుర్తుకు వస్తాయి. రొటీన్ గా వచ్చే పాటలకు ఈ పాటకు చాలా తేడా ఉంది. సాహిత్యంకాని, సంగీతంకాని, గానం విషయంలో చాలా కొత్తదనం కనిపిస్తుంది. పాత జనరేషన్ తమ రోజుల్లోకి వెళ్తే కొత్త జనరేషన్ వాళ్లు ఫ్రెష్ గా ఫీలవుతారు.
ఇద్దరు బార్య భర్తలు లేక ఇద్దరు ప్రేమికుల మధ్య సరసపు గొడవ ఎట్లుంటుంది అనేది ఈ పాట వింటే అర్థమవుతుంది. నూతన సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి బాణీలో మిట్టపల్లి సురేందర్ ఈ పాటకు సాహిత్యాన్ని అందించాడు.భిన్నమైన స్వరంతో విల్సన్ హెరాల్డ్ అనే గాయకుడు ఆలపించారు. ఇదొక ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీ, మానవ సంబంధాలు కనుమరుగవుతున్న ప్రస్తుత ప్రపంచంలో ఇద్దరు ప్రేమికుల మధ్య జరగిన సంఘటనలకు రూపమే గువ్వగోరింక. విభిన్న మనస్తత్వం కలిగిన ఇద్దరు ప్రేమికుల ఈ ప్రేమకథను దర్శకుడు ఎంతో ఆసక్తికరంగా తెరకెక్కించాడు. కొత్తతరహా సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులతో పాటు అన్ని వర్గాల వారికి నచ్చే చిత్రమిది అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: సురేష్ బొబ్బిలి, పాటలు: కందికొండ, కృష్ణకాంత్, మిట్టపల్లి సురేందర్, మాటలు: బజారా, ఫోటోగ్రఫీ: మైల్స్ రంగస్వామి, ఆర్ట్: సాంబ కాస్ట్యూమ్స్: వినూత్న శత్రు, ఎడిటర్: గ్యారి బిహెచ్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments