గాడ్సేకు ఫ్యాన్ క్లబ్.. బీజేపీకి గుత్తాజ్వాల చురకలు!
Send us your feedback to audioarticles@vaarta.com
మహాత్మా గాంధీని చంపిన గాడ్సే దేశభక్తుడంటూ బీజేపీ నేతలు హంగామా చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా.. సాధ్వీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్, కేంద్ర మంత్రి హెగ్డే, కర్ణాటక నేత నలిన్ కుమార్‌లు గాడ్సేను గాడ్‌లాగా భావిస్తూ ఓ రేంజ్‌లో ప్రశంసల వర్షం కురిపించారు. అయితే నేతలు చేసిన ఈ వ్యాఖ్యలపై అన్ని వైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. అంతేకాదు సొంత పార్టీ నేతలే ఈ వ్యాఖ్యల పట్ల కన్నెర్రజేశారు. దీంతో ప్రజ్ఞా సింగ్ వెనక్కు తగ్గి క్షమాపణలు కోరారు. అయినప్పటికీ ఈ వివాదానికి ఇంకా ఫుల్‌స్టాప్ పడలేదు.
ఇప్పటికే ఈ వ్యవహారంపై పలువురు కాంగ్రెస్ నేతలు, విశ్లేషకులు, ప్రముఖులు సోషల్ మీడియా, టీవీ చానెల్స్ డిబెట్ల వేదికగా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తాజాగా.. బాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలా ట్విట్టర్ వేదికగా స్పందించారు."గాంధీజీ హంతకుడైన గాడ్సేకు కూడా ఓ ఫ్యాన్ క్లబ్ ఉందని నాకు తెలియదు. బాపూను చంపడాన్ని ఇంకా కొందరు సమర్థించడం ఆశ్చర్యంగా ఉంది. దీన్నిబట్టి భవిష్యత్‌లో మన పిల్లలు మన దేశ చరిత్రనే నమ్మబోరు. ఈ పరిస్థితులు చూస్తే నాకు నిజంగానే భయం కలుగుతోంది" అని గుత్తా ఆందోళన వ్యక్తం చేశారు. కాగా ఈ ట్వీట్‌కు పలువురు నెటిజన్లు అడ్డదిడ్డంగా వాదించగా వారిపై గుత్తా కౌంటర్ల వర్షం కురిపించింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com