గాడ్సేకు ఫ్యాన్ క్లబ్.. బీజేపీకి గుత్తాజ్వాల చురకలు! 

  • IndiaGlitz, [Saturday,May 18 2019]

మహాత్మా గాంధీని చంపిన గాడ్సే దేశభక్తుడంటూ బీజేపీ నేతలు హంగామా చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా.. సాధ్వీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్, కేంద్ర మంత్రి హెగ్డే, కర్ణాటక నేత నలిన్ కుమార్‌లు గాడ్సేను గాడ్‌లాగా భావిస్తూ ఓ రేంజ్‌లో ప్రశంసల వర్షం కురిపించారు. అయితే నేతలు చేసిన ఈ వ్యాఖ్యలపై అన్ని వైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. అంతేకాదు సొంత పార్టీ నేతలే ఈ వ్యాఖ్యల పట్ల కన్నెర్రజేశారు. దీంతో ప్రజ్ఞా సింగ్ వెనక్కు తగ్గి క్షమాపణలు కోరారు. అయినప్పటికీ ఈ వివాదానికి ఇంకా ఫుల్‌స్టాప్ పడలేదు.

ఇప్పటికే ఈ వ్యవహారంపై పలువురు కాంగ్రెస్ నేతలు, విశ్లేషకులు, ప్రముఖులు సోషల్ మీడియా, టీవీ చానెల్స్ డిబెట్ల వేదికగా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తాజాగా.. బాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలా ట్విట్టర్ వేదికగా స్పందించారు.గాంధీజీ హంతకుడైన గాడ్సేకు కూడా ఓ ఫ్యాన్ క్లబ్ ఉందని నాకు తెలియదు. బాపూను చంపడాన్ని ఇంకా కొందరు సమర్థించడం ఆశ్చర్యంగా ఉంది. దీన్నిబట్టి భవిష్యత్‌లో మన పిల్లలు మన దేశ చరిత్రనే నమ్మబోరు. ఈ పరిస్థితులు చూస్తే నాకు నిజంగానే భయం కలుగుతోంది అని గుత్తా ఆందోళన వ్యక్తం చేశారు. కాగా ఈ ట్వీట్‌కు పలువురు నెటిజన్లు అడ్డదిడ్డంగా వాదించగా వారిపై గుత్తా కౌంటర్ల వర్షం కురిపించింది.

More News

టీవీ9 వివాదం: మరో షాకింగ్ ‘గరుడ పురాణం’ చెప్పిన శివాజీ!

టీవీ9 షేర్ల వివాదంలో ఈ చానెల్ మాజీ సీఈవో.. రవిప్రకాష్, గరుడ పురాణం శివాజీ ఇద్దరూ పరారీలో ఉన్న విషయం విదితమే.. వారి కోసం పోలీసులు వేట సాగిస్తున్నారు.

'వెంకీ మామ‌' టీజ‌ర్ ఎప్పుడో తెలుసా?

విక్ట‌రీ వెంక‌టేష్‌, అక్కినేని నాగ‌చైత‌న్య నిజ జీవితంలోనే కాదు.. రీల్ లైఫ్‌లోనూ మామ అల్లుళ్లుగా న‌టిస్తున్నారు. బాబీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్ర‌మే 'వెంకీ మామ‌'.

నాని కార‌ణంగా నాగ్ వెనక్కి..

కింగ్ నాగార్జున‌, ర‌కుల్ ప్రీత్ జంట‌గా న‌టిస్తున్న చిత్రం 'మ‌న్మ‌థుడు 2'. రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌కుడు. ఈ సినిమాను ముందుగా నాగార్జున పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఆగ‌స్ట్ 29న విడుద‌ల చేయాల‌ని అనుకున్నారు.

థియేట‌ర్స్ నిర్మాణంలోకి అజ‌య్ దేవ‌గ‌ణ్‌

బాలీవుడ్ హీరో అజ‌య్ దేవ‌గ‌ణ్‌కి న‌ట‌న‌తో పాటు సినిమా సంబంధిత వ్యాపారాలు కూడా ఉన్నాయి. ప్రొడ‌క్ష‌న్ హౌస్‌, వి.ఎఫ్‌.ఎక్స్ కంపెనీ .. ఉన్నాయి. ఇప్పుడు వీటితో పాటు

ఇదో సిల్లీ కేసు.. టీవీ9 వివాదం పై శివాజీ ఫస్ట్ టైం స్పందన 

టీవీ9 చానల్ యాజమాన్యంతో వివాదాల నేపథ్యంలో మాజీ సీఈవో రవిప్రకాష్, టాలీవుడ్ నటుడు, గరుడ పురాణం శివాజీ పరారీలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే ఈ వివాదంలో మూడు కేసులు