సంక్రాంతి బరిలో తప్పుకున్న 'గురు'..రిలీజ్ డేట్....
Send us your feedback to audioarticles@vaarta.com
సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం సుధ కొంగర దర్శకత్వంలో గురు సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సాలాఖద్దూస్ పేరుతో బాలీవుడ్‌లో పెద్ద సక్సెస్ అయిన చిత్రాన్ని గురు అనే టైటిల్‌తో తెలుగులో రీమేక్ చేస్తున్నారు. వెంకీ బాక్సింగ్ కోచ్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో రితిక సింగ్ శిష్యురాలి పాత్రలో నటిస్తుంది. తాజా సమాచారం ప్రకారం సినిమా చిత్రీకరణను పూర్తి చేసుకుంది.
చిన్న చిన్న ప్యాచ్ వర్క్‌లు పూర్తి చేయడానికి యూనిట్ ఇప్పుడు చెన్నై వెళుతుంది. సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలు స్పీడందుకోనున్నాయి. అయితే ఈ సినిమాను సంక్రాంతి బరిలోకి తీసుకురావాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఇప్పుడు సంక్రాంతికి విడుదల కావడం లేదు. రిపబ్లిక్ డే జనవరి 26న విడుదల కానుందట. దీనికి సంబంధించిన వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశాలున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com