అత్యంత వైభవంగా జరిగిన డా. యం.యస్.జి గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ 50వ జన్మదిన వేడుకలు
Send us your feedback to audioarticles@vaarta.com
యం.యస్.జి మూవీ ఫేమ్ సంత్ గుర్మీత్ రామ్ రహీమ్ 50వ జన్మదిన వేడుకలు హర్యానా రాష్ట్రం, సిర్సాలో డేరా సచ్చ సౌధ ప్రాంగణంలో ఆగష్టు 15న లక్షలాది యం.యస్.జి అభిమానుల మధ్య అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు హర్యానా రాష్ట్ర మంత్రులు, పోలీస్ ఆఫీసర్స్, ఎంతో మంది వి.ఐ.పిలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 20 ఎకరాల ప్రాంగణంలో వేసిన భారీ సెట్‌లో, అందరికి కనిపించే విధంగా ఎత్తైన వేదికపై డా. యం.యస్.జి ఆసీనులుకాగా, తొలుత 120 మంది అనాధలైన, విధవలైన, కులాంతర మతాంతర జంటలకు వివాహాం జరిపించి, ఒక్కో జంటకు 25వేల ఆర్ధిక సహకారం అందించారు.
అనంతరం కళాకారుల విన్యాసాలు, వినోద కార్యక్రమాలు, డేరా సచ్చ సౌధ చేస్తున్న సేవ కార్యక్రమాల డాక్యుమెంటరీ ప్రదర్శన తరువాత, భారీ ఆకారంగల నెమలి వాహనం పై తయారు చేసిన 5000 కిలోల (డా. యం.యస్.జి తనయ హానీ ప్రీత్ ఇన్సాన్ రూపొందించిన) కేక్‌ను తన వద్దనున్న బంగారు ఖడ్గంతో కట్ చేసి తన జన్మదినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. మూడు రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవంలో లక్షలాది మంది ప్రజలు హాజరై చిన్నా, పెద్ద, ముసలి, ముతక అనే బేధం లేకుండా ప్రతి ఒక్కరూ పాల్గొని బెలూన్స్, కొవ్వొత్తులు, డెకరేట్ కలర్ పేపర్స్‌తో తమ ఆరాధ్య దైవమైన డా. యం.యస్.జి.కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. పుట్టినరోజు సెలబ్రేషన్స్ తర్వాత ఆగస్ట్ 16న సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం డా. యం.యస్.జి. ముద్దుల తనయ హానీ ప్రీత్ ఇన్సాన్, డా. యం.యస్.జి ఇద్దరూ ప్రధాన పాత్రలు పోషిస్తూ రూపొందించే 'యం.యస్.జి. ఆన్‌లైన్ గురుకుల్' చిత్రం పోస్టర్‌ను విడుదల చేశారు. అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందే ఈ చిత్రం అక్టోబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.
ఈ సందర్భంగా డా. యం.యస్.జి మాట్లాడుతూ - '' ఈ రోజు ఆదర్శ వివాహాలు జరుపుకున్న జంటలకు నా ఆశీర్వచనాలు. సమాజంలో కుల, మత, వర్గ బేధాలు తొలిగిపోవాలి. ఎంతో మంది కన్యలకు ఈ సమస్య వుంది ఆర్ధిక సమస్య తో బాధపడుతున్న తల్లిదండ్రులకు ఈ రోజు ఆదర్శప్రాయంగా పెళ్లి చేసుకున్న ఈ యువకులు వారి కుటుంబాలలో వెలుతురు నింపుతున్నారు. ఒకనాటి చక్రవర్తి శాతకర్ణి తన తల్లి పేరే ఇంటిపేరుగా మార్చుకుని గౌతమి పుత్ర శాతకర్ణిగా మారాడు. అలాంటిది నవమాసాలు మోసి ఆడ బిడ్డకు జన్మనిచ్చిన తల్లి తన ఇంటిపేరును తనకూతురికి ఎందుకు పెట్టుకోకూడదు? ఈ ఆచారానికి ఈ రోజు శ్రీకారం చుట్టమని నా పుట్టిన రోజు సందర్భంగా మీ అందరికి నేను ప్రభోదిస్తున్నాను.
దేశంలో మన కార్యకర్తలు చేసిన రక్తదానాలకి, నేత్రదానాలకి, అవయవ దానాలకి, చెట్లు నాటడంలో వచ్చిన గిన్నిస్ బుక్ రికార్డులు గాని, ఆసియా రికార్డులు గాని, లిమ్కా బుక్ అఫ్ వరల్డ్ రికార్డ్స్ మీకే అంకితమిస్తున్నాను. ఇప్పటి వరకు ఉత్తర భారతంలో చేసిన సేవ కార్యక్రమాలే.. త్వరలో దక్షిణ భారతంలో ప్రారంభిస్తాను ఇందులో భాగంగా తొలుత హైదరాబాద్ నుండి మా సంస్థ చేస్తున్న కార్యక్రమాలు మొదలెడుతాము. ఇప్పటి వరకు వచ్చిన సందేశాత్మక చిత్రాలను మించి ఇంకా మంచి చిత్రాలను మీకు అందిస్తాను. నా తదుపరి చిత్రం 'యం.యస్.జి' ఆన్‌లైన్ గురుకుల్'. ఈ చిత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్న చెడుని నిర్మూలించే ఒక సైబర్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నాను'' అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com