తొలిప్రేమ గొప్పతనం చెప్పే గుప్పెడంత ప్రేమ

  • IndiaGlitz, [Wednesday,June 08 2016]
సాయి రోన‌క్, అదితి సింగ్ జంట‌గా నూత‌న ద‌ర్శ‌కుడు వినోద్ లింగాల తెర‌కెక్కించిన చిత్రం గుప్పెడంత ప్రేమ‌. ఈ చిత్రాన్ని ఐ వింక్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పై రూపొందించారు. విభిన్నక‌థాంశంతో రూపొందిన గుప్పెడంత ప్రేమ చిత్రాన్ని ఈ నెల 17న రిలీజ్ చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన మీడియా మీట్ లో
డైరెక్ట‌ర్ వినోద్ లింగాల మాట్లాడుతూ...యు.కె లో ఎం.ఎస్ పూర్తి చేసాను. సినిమాల‌పై ఉన్న‌మ‌క్కువ‌తో లండ‌న్ లో ఫిల్మ్ కోర్స్ చేసాను. ఆత‌ర్వాత హైద‌రాబాద్ వ‌చ్చి ఇట్స్ మై ల‌వ్ స్టోరి, సీత‌మ్మ‌వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు చిత్రాల‌కు అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా వ‌ర్క్ చేసాను. ఇప్పుడు నా ఫ్రెండ్స్ తో క‌లిసి ఐ వింక్ ప్రొడ‌క్ష‌న్స్ స్టార్ట్ చేసి గుప్పెడంత ప్రేమ చిత్రాన్ని తెర‌కెక్కించాను.
యూనివ‌ర్శిటీ బ్యాక్ డ్రాప్ లో జ‌రిగే విభిన్న ప్రేమ‌క‌థా చిత్ర‌మిది. అలాగే ఈ చిత్రంలో రైన్ బ్యాక్ డ్రాప్ లో షూటింగ్ చేసాం. అందుకోసం వ‌ర్షాలు ఎక్కువుగా ప‌డే మేఘ‌ల‌యాలోని చిరపుంజి, షిల్లాంగ్ లో షూటింగ్ చేసాం. తొలిప్రేమ ఫీలింగ్ ఎలా ఉంటుందో ఈ చిత్రంలో చూపించే ప్ర‌య‌త్నం చేసాం. అందుక‌నే ఈ చిత్రానికి ది మ్యాజిక్ ఆఫ్ తొలిప్రేమ అని క్యాప్ష‌న్ గా పెట్టాం. గీతాంజ‌లి, తొలిప్రేమ‌, ఏమాయ చేసావే..చిత్రాల వ‌లే మా గుప్పెడంత ప్రేమ కూడా ప్రేక్ష‌క హృద‌యాల్లో గుర్తుండిపోతుంది అనుకుంటున్నాను అన్నారు.