Gunturodu Review
మంచు మోహన్‌బాబు రెండో తనయుడు మంచు మనోజ్ సినిమా పరిశ్రమలో అడుగుపెట్టి పదేళ్లు పూర్తయ్యాయి. ఇన్నాళ్లూ వైవిధ్యమైన సినిమాల వైపు మొగ్గు చూపుతూ వచ్చిన ఆయన తాజాగా ఫక్తు కమర్షియల్ సినిమా చేశారు. ఆ సినిమా పేరు గుంటూరోడు. తను నమ్మిన సిద్ధాంతం కోసం ఎంత దూరమైనా వెళ్లే వ్యక్తిగా కనిపించారు. ఇన్నాళ్లూ ఆయన చేసిన యాక్షన్ సీక్వెన్స్ కన్నా భిన్నంగా, గొప్పగా ఈ సినిమాలో ఉంటుందని అందరూ చెబుతున్నారు. ఇప్పటిదాకా డిఫరెంట్‌గా కనిపించిన ప్రగ్యా జైశ్వాల్ ఇందులో తొలిసారి కమర్షియల్ హీరోయిన్‌గా కనిపించనుంది. అన్నీ కలిసి గుంటూరోడిని గరంగరంగా చూపిస్తుందా? లేదా? అనేది చదివేయండి.
కథ:
గుంటూరులోని ఇద్దరు వ్యక్తుల మధ్య పోరే ఈ సినిమా. ఆ ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు శేషు(సంపత్) అయితే మరొకరు కన్నా(మంచు మనోజ్). కమర్షియల్ లాయర్ అయిన సంపత్ అడ్డదారులు తొక్కి డబ్బు బాగా సంపాదిస్తాడు. ఎమ్మెల్యే సీటు కోసం గట్టి ప్రయత్నం చేస్తుంటాడు. అంతే కాకుండా తనకు ఎవరైనా ఎదురు చెబితే తట్టుకోలేని మనస్తత్వంతో ఉంటాడు. ఎవరైనా ఎదురు తిరిగితే వారిపై దొంగ కేసులు బనాయించి జైలుగు పంపతుంటాడు. శేషుకు గుంటూరు ఎమ్మెల్యే(కోట శ్రీనివాసరావు) అండదండలుంటాయి. అలాగే సూర్య నారాయణరావు(రాజేంద్రప్రసాద్) ఏకైక సంతానం కన్నా(మనోజ్)..ఆనందం వస్తే డ్యాన్స్ చేస్తాడు. ఎవరైనా అన్యాయం చేస్తుంటే చేయి దురద పెట్టి వారికి ఎదురు తిరుగే మనస్తత్వం. ఓ సారి హోటల్‌లో కన్నా, శేషుల మధ్య గొడవ జరుగుతుంది. ఆ గొడవలో శేషును కన్నా కొడతాడు. అప్పటి నుండి కన్నాపై శేషుపై పగ పెంచుకుని, అతన్ని చంపేయాలనుకుంటాడు. ఈలోపు కన్నా, శేషు ఒక్కగానొక్క చెల్లెలు అమృత(ప్రగ్యాజైశ్వాల్)తో ప్రేమలో పడతాడు. అమృత కూడా కన్నా నిజాయితీ, మనస్తత్వం నచ్చి అతన్ని ప్రేమిస్తుంది. ఇంతకు కన్నా, అమృతల ప్రేమను శేషు ఒప్పుకుంటాడా? అసలు శేషు, కన్నాను చంపాలనుకునే ప్రయత్నాలు ఎంత వరకు సక్సెస్ అవుతాయి? చివరకు గుంటూరోడు తన ప్రేమను ఎలా గెలుగచుకున్నాడనే సంగతి తెలసుకోవాలంటే సినిమా చూడాల్సిందే...
ప్లస్ పాయింట్స్:
- మనోజ్, సంపత్ సహా నటీనటుల పెర్‌ఫార్మెన్స్
- నిర్మాణ విలువలు
- సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్:
- రోటీన్ కమర్షియల్ కథ
- బ్యాక్ గ్రౌండ్ స్కోర్
- ఒక వర్గం ప్రేక్షకులకు పరిమితం అవుతుంది
- ఫస్టాఫ్
విశ్లేషణ:
గుంటూరు మిరపకాయ ఎంత ఘాటుగా ఉంటుందో అలాంటి క్యారెక్టర్‌లో మనోజ్ నటన మెప్పిస్తుంది. డ్యాన్సులు, ఫైట్స్‌లో మనోజ్ ఫుల్ ఎనర్జీని చూపించాడు. కమర్షియల్ హీరోగా కనపడంలో మనోజ్ బాడీ లాంగ్వేజ్ ఆకట్టుకుంటుంది. ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సంపత్ నట..ఈగోతో ప్రతీకారం తీర్చుకోవాలనే పాత్రలో సంపత్ నటన కొత్తగా అనిపిస్తుంది. ఇక ప్రగ్యాజైశ్వాల్ తన పాత్రకు న్యాయం చేసింది. కోట, రాజేంద్రప్రసాద్, రావు రమేష్, తదితరులు వారి వారి పాత్రల్లో ఇదిగిపోయారు. పృథ్వీ, ప్రవీణ్, సత్య, హర్ష క్యారెక్టర్స్‌తో డైరెక్టర్ కామెడిని పండించే ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నం పెద్దగా సక్సెస్ కాలేదు. ఇక సాంకేతికంగా చూస్తే దర్శకుడు సత్య..మనోజ్‌ను కొత్తగా చూపించే ప్రయత్నం సక్సెస్ అయ్యింది. ఇప్పటి వరకు ఫక్తు కమర్షియల్ మూవీ చేయని మనోజ్‌ను డైరెక్టర్ చక్కగా ప్రెజెంట్ చేశాడు. డైలాగ్స్ గొప్పగా లేవు. సిద్ధార్థ్ రామస్వామి సినిమాటోగ్రఫీ బావుంది. కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ బావుంది. హీరో, విలన్ మధ్య వచ్చే ఛాలెంజింగ్ ట్రాక్ సెకండాఫ్‌లో ఆకట్టుకుటుంది. అయితే ఫస్టాఫ్‌ను సాగదీత చూపించినట్టు అనిపించింది. హీరో, హీరోయిన్ మధ్య లవ్ సీన్స్ హత్తుకునేలా ఉండవు. విలన్, హీరో మధ్య పోరే కీలకమైపోయింది. ఇంటర్వెల్ బ్లాక్ బావుంది. ఎమోషన్స్ బాగానే ఉన్నాయి. నిర్మాణ విలువలు బావున్నాయి.
బోటమ్ లైన్: గుంటూరోడు... ఫక్తు కమర్షియల్ సినిమా
Gunturodu English Version Review
- Read in English