గుంటూరోడు ఆడియోకు గెస్ట్ లు వీళ్లే..!
Send us your feedback to audioarticles@vaarta.com
రాకింగ్ స్టార్ మంచు మనోజ్ & బ్యూటిఫుల్ ప్రగ్యా జైస్వాల్ జంటగా S.K. సత్య తెరకెక్కిస్తున్న లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గుంటూరోడు. ఈ చిత్రాన్ని క్లాప్స్ అండ్ విజిల్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై వరుణ్ అట్లూరి నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్ర ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి అశేష స్పందన లభిస్తుంది.
మనోజ్ గత చిత్రాలను మైమరింపచేసేలా, ఈ మాస్ ట్రైలర్ ఆకట్టుకుంటుంది. ఇక ఆడియో విషయానికి వస్తే...శ్రీవసంత్ సంగీతం అందించిన గుంటూరోడు ఆడియోను ఈనెల 29న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. హైదరాబాద్ లో జెఆర్.సి కన్వెషన్ సెంటర్ లో జరిగే ఈ వేడుకకు యువ హీరోలు సాయిధరమ్ తేజ్, నాని, శర్వానంద్, రకుల్ ప్రీత్ సింగ్ లు హాజరు కానున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments