SS Thaman:బాక్స్‌లు బద్ధలవుతున్నాయ్.. థమన్‌ని కంట్రోల్ చేయండి , వణికిపోతున్న థియేటర్ యాజమాన్యాలు
Send us your feedback to audioarticles@vaarta.com
ఒక సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడానికి కథ, కథనం, పాటలు, సంగీతం ముఖ్యభూమిక పోషిస్తాయి. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా ఇందులోకి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వచ్చి చేరింది. మాస్ సినిమాల్లో హీరో ఎలివేషన్స్ సీన్స్ పండాలంటే దానికి ఖచ్చితంగా అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వుండాల్సిందే. ఇండస్ట్రీలో అలాంటి మ్యూజిక్ ఇచ్చే వారిలో దేవిశ్రీ ప్రసాద్, థమన్, అనిరుథ్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు థమన్ ఈ విషయంలో అందరికంటే ముందున్నాడని చెప్పొచ్చు. బ్యాక్ గ్రౌండ్ స్కోరు కోసమే ప్రత్యేకంగా ఆయనతో డీల్స్ కుదుర్చుకుంటున్నారంటే అతిశయోక్తి కాదు. థమన్ మ్యూజిక్ వల్ల ఎన్నో సినిమాలు హిట్ అయ్యాయి. అఖండలో బాలయ్య నట విశ్వరూపానికి థమన్ నేపథ్య సంగీతం కూడా జతకలవడంతో థియేటర్లు దద్దరిల్లిపోయాయి. చాలా చోట్ల సౌండ్ బాక్స్‌లు పేలిపోయాయని థియేటర్ యాజమాన్యాల నుంచి ఫిర్యాదులు అందాయి.
తాజాగా బోయపాటి శ్రీను, రామ్ పొతినేని కాంబినేషన్లో వచ్చిన ‘‘స్కంద’’కు కూడా థమన్ అదిరిపోయే బీజీ ఇచ్చాడు. బాలయ్యకు మించి ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ను ప్రేక్షకులు తట్టుకోలేకపోతున్నారు. అటు థియేటర్ యాజమాన్యాలు కూడా థమన్‌ను కంట్రోల్ చేయాలంటూ మొరపెట్టుకుంటున్నాయి. దీనిపై గుంటూరు నగరంలోని గౌరీ శంకర్ థియేటర్ యాజమాన్యం ఏకంగా ట్విట్టర్లో థమన్ గురించి పెద్ద స్టోరీ రాసుకొచ్చింది. థమన్‌ను ఎవరైనా కంట్రోల్ చేయాలని.. లేదంటే థియేటర్లో సౌండ్ సిస్టమ్స్ తట్టుకోవడం కష్టమని, స్కంద సినిమా ప్రదర్శిస్తుండగా సౌండ్ పొల్యూషన్ తట్టుకోలేక స్వయంగా ప్రేక్షకులే సౌండ్ తగ్గించాలని విజ్ఞప్తి చేశారని గౌరీ శంకర్ థియేటర్ తెలిపింది. ఇది ప్రేక్షకులతో పాటు థియేటర్లకు సైతం ఇబ్బందికరంగా మారిందని పేర్కొంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments