గుంటూరులో 'గ్యాంగ్స్ ఆఫ్ గుంటూర్ టాకీస్' ఇంట్రడక్షన్ ఈవెంట్..!!
Send us your feedback to audioarticles@vaarta.com
నేషనల్ అవార్డ్ గ్రహీత ప్రవీణ్ సత్తారు తాజాగా రూపొందిస్తున్న "గుంటూర్ టాకీస్"లోని గ్యాంగ్స్ ను.. విజయవాడ-గుంటూరు సమీపంలో గల "హాయ్ ల్యాండ్"లో ఆగస్టు 2న, ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా అత్యంత ఘనంగా నిర్వహించే పబ్లిక్ ఈవెంట్ లో ఇంట్రడ్యూస్ చేయనున్నారు.
సిద్ధు, రాష్మీగౌతం, శ్రద్ధదాస్, నరేష్ విజయ్ కృష్ణ, మహేష్ మంజ్రేకర్, రాజా రవీంద్ర, స్నిగ్ధ, తాగుబోతు రమేష్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని ఆర్.కె.స్టూడియోస్ పతాకంపై రాజ్ కుమార్.ఎం నిర్మిస్తున్నారు.
ఇటీవలె డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకొన్న ఈ చిత్రం ప్రస్తుతం రీ-రికార్డింగ్ జరుపుకుంటోంది.
చిత్ర నిర్మాత రాజ్ కుమార్.ఎం మాట్లాడుతూ... "ప్రవీణ్ సత్తారు ఎంతో ప్రతిష్టాత్మకంగా, అత్యంత ప్రణాళికబద్ధంగా "గుంటూర్ టాకీస్" చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఆగస్టు 2న విజయవాడ-గుంటూర్ నడుమ గల "హాయ్ ల్యాండ్"లో ఐదు వేల స్టూడెంట్స్ సమక్షంలో ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా "గ్యాంగ్స్ ఆఫ్ గుంటూర్ టాకీస్"ను ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. దర్శకుడిగా ప్రవీణ్ సత్తారును మరో మెట్టు ఎక్కించే "గుంటూర్ టాకీస్" నిర్మిస్తున్నందుకు గర్వపడుతున్నాను" అన్నారు.
ఈ చిత్రానికి నృత్యాలు: గణేష్ మాస్టర్, సంగీతం: శ్రీచరణ్ పాకాల, చాయాగ్రహణం: రామ్ రెడ్డి, కూర్పు: ధర్మేంద్ర కాకరాల, నిర్మాణం: ఆర్.కె.స్టూడియోస్, నిర్మాత: రాజ్ కుమార్.ఎం, రచన-దర్శకత్వం: ప్రవీణ్ సత్తారు!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com