'గుంటూరు టాకీస్' ఫస్ట్ లుక్ లాంచ్
- IndiaGlitz, [Tuesday,August 04 2015]
నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ ప్రవీణ్‌సత్తారు దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం గుంటూర్ టాకీస్' ఈ చిత్రంలో సిద్ధు జొన్నగడ్డ, నరేష్ విజయ్‌కృష్ణ, రేష్మీ గౌతమ్, శ్రద్ధాదాస్, లక్ష్మీ మంచు, మహేష్ మంజ్రేకర్ ప్రధాన తారాగణంగా నటించారు. ఆర్.కె.స్టూడియోస్ బ్యానర్‌పై రాజ్‌కుమార్.ఎం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల కార్యక్రమం ఇటీవల గుంటూరులోని హాయ్ లాండ్లో ఐదువేల మంది స్టూడెంట్స్ నుడుమ అహ్లాదకరమైన వాతావరణంలో ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో ప్రముఖ రాజకీయ నాయకులు రాయపాటి సాంబశివరావు, మల్లాది విష్ణు, దర్శకుడు ప్రవీణ్ సత్తార్, చిత్ర నిర్మాత రాజ్‌కుమార్.ఎం, సిద్ధు, రష్మీ గౌతమ్, రవి సహా చిత్రయూనిట్ సభ్యు పాల్గొన్నారు. ఈ సందర్భంగా....
దర్శకుడు ప్రవీణ్ సత్తారు మాట్లాడుతూ చందమామ కథలు సినిమా తర్వాత చేస్తున్న సినిమా ఇది. నేషనల్ అవార్డ్ సినిమా తర్వాత చేస్తున్న సినిమా కావడంతో నాపై బాధ్యత పెరిగింది. రామ్కుమార్గారు సినిమాని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. నేను చేస్తున్న సినిమాల్లో సామాజిక స్పృహ ఉన్నట్లు ఈ సినిమాలో సామాజిక స్పృహతో పాటు సినిమా అవుటండ్ అవుట్ కామెడితో ఫాస్ట్ పేజ్‌లో ఉంటుంది. ప్రతి పాత్ర నవ్విస్తుంటుంది. మహేష్ మంజ్రేకర్గారు విలన్‌గా నటిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాు జరుగుతున్నాయి. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వస్తాం'' అన్నారు.
నిర్మాత రాజ్‌కుమార్.ఎం మాట్లాడుతూ నేషనల్ అవార్డ్ విన్నర్ ప్రవీణ్ సత్తార్గారితో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. నా మొదటి సినిమా ఫస్ట్ లుక్‌ని నా సొంతవూరైన గుంటూరులో చేయడం ఆనందంగా ఉంది. సినిమాని పెద్ద సక్సెస్ చేయాలని ప్రేక్షకులను కోరుకుంటున్నాను. గుంటూరులో ఓ ఫిలింసిటీని నిర్మించానే ఆలోచనతో ఉన్నాను. ఫస్ట్ ఫ్రేమ్ నుండి లాస్ట్ ఫ్రేమ్ వరకు సినిమా కామెడితో సాగుతుంది. జబర్దస్త్ ప్రోగ్రామ్‌తో ఫేమస్ అయిన రేష్మీ గౌతమ్ ఈ సినిమాలో మెయిన్ లీడ్ చేస్తుంది. ఆమెను హీరోయిన్గా, సిద్ధుని హీరోగా పరిచయం చేస్తున్నాం. త్వరలోనే సినిమాని విడుదల చేయడానికి సన్నాహాు చేస్తున్నాం'' అన్నారు.
హీరో సిద్ధు మాట్లాడుతూ ప్రవీణ్‌గారి దర్శకత్వంలో సినిమా చేయడం హ్యాపీగా ఉంది. ఈ సినిమాతో మంచి బ్రేక్ వస్తుందని అనుకుంటున్నాను. అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతకు థాంక్స్'' అన్నారు.
రేష్మీ గౌతమ్ మాట్లాడుతూ జబర్దస్త్ ప్రోగ్రామ్‌లో నన్ను ఆదరించిన విధంగానే సినిమాలో నన్ను అభిమానిస్తారని ఆదరిస్తారని భావిస్తున్నాను. టీవీల్లో నటించిన నాపై నమ్మకంతో ఈ సినిమాలో మెయిన్‌లీడ్ అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్'' అన్నారు.
నరేష్ మాట్లాడుతూ చందమామ కథలు సినిమాలో ప్రవీణ్ సత్తారుగారు నన్ను చాలా కొత్తగా చూపించారు. ఈ సినిమాలో నన్ను మరింత కొత్తగా చూపిస్తున్నాడు. నా క్యారెక్టర్ చాలా కొత్తగా ఉంటుంది. అందరికీ నచ్చుతుంది'' అన్నారు.
రఘుబాబు మాట్లాడుతూ ఈ సినిమాలో కానిస్టేబుల్ పాత్రలో నటించాను. చాలా కామెడిగా సాగుతుంది. అలాగే ప్రతి పాత్ర కామెడిగా ఉంటూ లాస్ట్ సీన్ వరకు సినిమా ఎంటర్టైనింగ్గా సాగుతుంది'' అన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు సినిమా ఫస్ట్ లుక్ చాలా డిఫరెంట్‌గా ఉందని, ఆడియో, సినిమా పెద్ద హిట్ కావాలని యూనిట్‌ను అభినందించారు.
ఈ చిత్రానికి ఎడిటర్: ధరేంద్ర కాకరాల, సినిమాటోగ్రఫీ: రామిరెడ్డి.పి, మ్యూజిక్: శ్రీచరణ్ పాకాల, నిర్మాత: రాజ్‌కుమార్.ఎం, రచన-దర్శకత్వం: ప్రవీణ్ సత్తారు.