Guntur Karam:‘గుంటూరు కారం’ ఫస్ట్ సింగిల్ ఆడియో క్లిప్ లీక్.. సోషల్ మీడియాలో వైరల్..
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ మహేష్ బాబు- మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘గుంటూరు కారం’ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజైన టీజర్ ఫ్యాన్స్‌ని విపరీతంగా ఆకట్టుకుంది. అయితే అప్పటి నుంచి ఇప్పటివరకు సినిమా నుంచి ఒక అప్టేట్ కూడా రాలేదు. మధ్యమధ్యలో మూవీ పోస్టర్స్ వదిలినా.. అవి అభిమానులను సంతృప్తిపర్చలేదు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సినిమాను విడుదల చేస్తామని మూవీ యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో విడుదలకు మరో రెండు నెలలు మాత్రమే సమయం ఉండగా ఇప్పటికీ సినిమా నుంచి ఒక్క పాట కూడా రిలీజ్ కాలేదు. దీనిపై ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తి చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే ఇటీవల నవంబర్ మొదటి వారంలో ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేస్తామని నిర్మాత ప్రకటించారు. కానీ ఈ పాట లీకైందని సోషల్ మీడియాలో ఓ ఆడియో క్లిప్ తెగ వైరల్ అవుతోంది. ‘మసాలా బిర్యానీ’ అంటూ సాగిన ఈ క్లిప్ ఫ్యాన్స్‌ని ఆకట్టుకుంది. అయితే కొంతమంది మాత్రం ఈ పాట సంగీత దర్శకుడు థమన్ గత చిత్రాల్లోని పాటల మాదిరిగానే ఉందని ట్రోల్ చేస్తున్నారు. అంతేకాకుండా థమన్ కావాలనే పాటను లీక్ చేశారని విమర్శిస్తున్నారు. అయితే చిత్రబృందం మాత్రం ఇంతవరకు ఈ పాట లీక్‌పై స్పందించలేదు. ఇది నిజంగా గుంటూరుకారం సినిమాలోని పాటనా..? లేదా..? తేలాలంటే పాట విడుదల అయ్యేవరకు వేచి చూడాల్సిందే.
ఇక మూవీ విషయానికొస్తే అతడు, ఖలేజా సినిమాల తర్వాత మహేష్-త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న మూడో సినిమా 'గుంటూరు కారం'. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శ్రీలీల మెయిన్ లీడ్‌గా, మీనాక్షి చౌదరి సెకండ్ హీరోయిన్‌గా ఇందులో నటిస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా 2024, జనవరి 12న మూవీ విడుదల కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com