Guntur Karam:‘గుంటూరు కారం’ ఫస్ట్ సింగిల్ ఆడియో క్లిప్ లీక్.. సోషల్ మీడియాలో వైరల్..

  • IndiaGlitz, [Saturday,November 04 2023]

సూపర్ స్టార్ మహేష్ బాబు- మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘గుంటూరు కారం’ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజైన టీజర్ ఫ్యాన్స్‌ని విపరీతంగా ఆకట్టుకుంది. అయితే అప్పటి నుంచి ఇప్పటివరకు సినిమా నుంచి ఒక అప్టేట్ కూడా రాలేదు. మధ్యమధ్యలో మూవీ పోస్టర్స్ వదిలినా.. అవి అభిమానులను సంతృప్తిపర్చలేదు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సినిమాను విడుదల చేస్తామని మూవీ యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో విడుదలకు మరో రెండు నెలలు మాత్రమే సమయం ఉండగా ఇప్పటికీ సినిమా నుంచి ఒక్క పాట కూడా రిలీజ్ కాలేదు. దీనిపై ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తి చేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే ఇటీవల నవంబర్ మొదటి వారంలో ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేస్తామని నిర్మాత ప్రకటించారు. కానీ ఈ పాట లీకైందని సోషల్ మీడియాలో ఓ ఆడియో క్లిప్ తెగ వైరల్ అవుతోంది. ‘మసాలా బిర్యానీ’ అంటూ సాగిన ఈ క్లిప్ ఫ్యాన్స్‌ని ఆకట్టుకుంది. అయితే కొంతమంది మాత్రం ఈ పాట సంగీత దర్శకుడు థమన్ గత చిత్రాల్లోని పాటల మాదిరిగానే ఉందని ట్రోల్ చేస్తున్నారు. అంతేకాకుండా థమన్ కావాలనే పాటను లీక్ చేశారని విమర్శిస్తున్నారు. అయితే చిత్రబృందం మాత్రం ఇంతవరకు ఈ పాట లీక్‌పై స్పందించలేదు. ఇది నిజంగా గుంటూరుకారం సినిమాలోని పాటనా..? లేదా..? తేలాలంటే పాట విడుదల అయ్యేవరకు వేచి చూడాల్సిందే.

ఇక మూవీ విషయానికొస్తే అతడు, ఖలేజా సినిమాల తర్వాత మహేష్-త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న మూడో సినిమా 'గుంటూరు కారం'. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శ్రీలీల మెయిన్ లీడ్‌గా, మీనాక్షి చౌదరి సెకండ్ హీరోయిన్‌గా ఇందులో నటిస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా 2024, జనవరి 12న మూవీ విడుదల కానుంది.

More News

Bigg Boss Telugu 7 : శోభాను గెలిపించిన అమర్‌దీప్ .. ఈ సీజన్‌లో తొలి లేడీ కెప్టెన్‌గా డాక్టర్ మోనిత, శివాజీపై గౌతమ్ ఫిర్యాదు

బిగ్‌బాస్ 7 తెలుగులో ఈ వారం కెప్టెన్సీ టాస్క్ నడుస్తోంది. ఇంటి సభ్యులు వీర సింహాలు, గర్జించే పులులుగా విడిపోయి టాస్క్‌ల్లో పాల్గొంటున్నారు.

MIM Party:ఎంఐఎం పార్టీ కీలక ప్రకటన.. 9 స్థానాల్లో పోటీకి సై..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పోటీపై ఎంఐఎం పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. తమ కంచుకోట స్థానాలైన ఏడు నియోజకవర్గాలతో

AP Cabinet:కులగణనకు గ్రీన్ సిగ్నల్.. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..

ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. సీఎం జగన్ అధ్యక్షతన సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది.

Ramakrishna Reddy:కాంగ్రెస్‌కు షర్మిల మద్దతు ఇవ్వడంపై.. సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు..

తెలంగాణ ఎన్నికల్లో పోటీకి వైసీటీపీ అధినేత షర్మిల దూరం కావడంపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి  కీలక వ్యాఖ్యలు చేశారు.

Rishabh Pant and Akshar Patel:తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భారత క్రికెటర్లు రిషబ్ పంత్, అక్షర్ పటేల్

భారత క్రికెటర్లు రిషబ్ పంత్, అక్షర్ పటేల్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.