Guntur Karaam:'గుంటూరు కారం' నుంచి క్లాస్ సాంగ్ వచ్చేసిందోచ్..
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు మరో శుభవార్త వచ్చేసింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ హీరోగా నటిస్తున్న మాస్ మసాలా మూవీ 'గుంటూరు కారం' నుంచి సెకండ్ సింగిల్ రిలీజైంది. 'ఓ మై బేబీ’ అంటూ సాగే ఈ పాటకి థమన్ సంగీతం అందించగా.. రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ రాశారు. ఇక శిల్పారావు ఈ పాటని పాడారు. ఇక గతంలో విడుదలైన ‘దమ్ మసాలా’సాంగ్ ఇప్పటికే చార్ట్ బస్టర్‌గా నిలిచింది.
ఈ సినిమాలో మొత్తం నాలుగు పాటలు ఉండనున్నాయి. ఇప్పటికే రెండు పాటలను విడుదల చేసిన చిత్ర బృందం న్యూఇయర్ లోపు మిగిలిన రెండు పాటలను రిలీజ్ చేయనుందట. అలాగే కొత్త సంవత్సరం కానుకగా మూవీ టీజర్ కూడా రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది. దీంతో ప్రిన్స్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. కాగా 'భరత్ అనే నేను', 'మహర్షి', 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న మహేష్.. ఈ సినిమాతో డబుల్ హ్యాట్రిక్ దిశగా కొనసాగాలని అభిమానులు ఆశిస్తున్నారు.
ఇక ఈ మూవీ విషయానికొస్తే అతడు, ఖలేజా సినిమాల తర్వాత మహేష్- త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న మూడో సినిమా 'గుంటూరు కారం'. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శ్రీలీల మెయిన్ లీడ్‌గా, మీనాక్షి చౌదరి సెకండ్ హీరోయిన్‌గా ఇందులో నటిస్తున్నారు. మహేష్ బాబును గతంలో ఎప్పుడూ చూడని విధంగా మాస్ అవతారంలో ఈ మూవీలో త్రివిక్రమ్ చూపించున్నారని ఫిల్మ్ నగర్ టాక్. దీంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా 2024, జనవరి 12న మూవీ విడుదల కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments