Salaar:'సలార్' ఫైర్ ముందు కొట్టుకుపోయిన గుంటూరోడు

  • IndiaGlitz, [Thursday,December 14 2023]

దేశంలో ఇప్పుడు ఎక్కడా చూసినా 'సలార్' ఫీవరే కనిపిస్తోంది. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించడం, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించడంతో ఈ సినిమాపై తొలి నుంచి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ట్రైలర్ విడుదలయ్యాక మరింత క్రేజ్ నెలకొంది. ఈ క్రమంలోనే తాజాగా విడుదల చేసిన 'సూర్యుడే' సాంగ్ యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. ఈ పాటలో ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ మధ్య స్నేహాన్ని ఎమోషనల్‌గా చూపించారు. రవి బస్రూర్ ఈ పాటకు బాణీలు అందించారు. కృష్ణకాంత్ లిరిక్స్ అందించగా.. హరిణి ఇవతూరి ఈ పాటను పాడారు.

ఇదే సమయంలో మహేష్ బాబు నటించిన గుంటూరు కారం నుంచి 'ఓ మై బేబీ' అనే లవ్లీ మెలోడీ సాంగ్ రిలీజ్ అయ్యింది. థమన్ ఈ సినిమాకి సంగీతం అందించారు. కేవలం 45 నిమిషాల వ్యవధిలోనే ఈ రెండు విడుదల అయ్యాయి. అయితే గుంటూరోడు కంటే సలారోడు యూట్యూబ్‌ రికార్డ్స్‌లో పైచేయి సాధించాడు. రిలీజ్ అయిన 20 గంటల్లో 'ఓ మై బేబీ' సాంగ్ 2.5M వ్యూస్, 172K లైక్స్ అందుకుంటే.. 'సూర్యుడే' సాంగ్ 4.7M వ్యూస్, 487K లైక్స్ రాబట్టి రికార్డ్ సృష్టించింది. ఇప్పటికే 'సలార్-సీజ్ ఫైర్' ట్రైలర్ అన్ని భాషల్లో కలిపి 24 గంటల్లోనే ఏకంగా 116 మిలియన్ల వ్యూస్ అందుకుని రికార్డు సృష్టించింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో కేజీఎఫ్ హీరో యశ్‌ నటిస్తున్నారంటూ కొన్నిరోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై చిత్ర నిర్మాత విజయ్‌ కిరంగదూర్‌ స్పందించారు. ‘సలార్‌’ చిత్రానికి ‘కేజీయఫ్‌’కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేశారు. ఈ వార్తల్లో నిజం లేదు అని ఆయన క్లారిటీ ఇచ్చారు. మరోవైపు విడుదలకు ముందే మూవీ బిజినెస్ రికార్డు స్థాయిలో జరిగినట్లు తెలుస్తోంది. సినిమా ఓటీటీ రైట్స్ రూ.160 కోట్లకు అమ్ముడైనట్లు సమాచారం. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ దీనిని దక్కించుకున్నట్లు ఫిల్మ్‌నగర్ వర్గాలు చెబుతున్నాయి. ఇక విడుదల లోపు ఈ మూవీ ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి మరి.

More News

PM Modi:పార్లమెంట్‌లో దాడిపై ప్రధాని మోదీ కీలక భేటీ.. భద్రతా సిబ్బందిపై వేటు..

పార్లమెంట్‌లో బుధవారం జరిగిన దాడి దేశవ్యాప్తంగా సంచనలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ప్రధాని మోదీ కీలక మంత్రులతో

Visakhapatnam:విశాఖలోని ఓ ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం

విశాఖపట్టణంలోని ఇండస్‌ ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. జగదాంబకూడలి సమీపంలో ఉన్న ఈ ఆసుపత్రిలో

Smita Sabharwal:కేంద్ర సర్వీసులకు వెళ్లడం లేదు.. స్వితా సభర్వాల్ క్లారిటీ..

తెలంగాణ సీనియర్ ఐపీఎస్ అధికారి స్వితా సభర్వాల్.. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించారు.

Rana:‘రాక్షస రాజా’గా రానా.. ‘నేనే రాజు నేనే మంత్రి’ కాంబో ఈజ్ బ్యాక్..

హీరో దగ్గుబాటి రానా తన పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమాను ప్రకటించారు. తనకు బ్లాక్‌బాస్టర్ హిట్ ఇచ్చిన తేజ దర్శకత్వంలో

Gaddam Prasad:తెలంగాణ శాసనసభాపతిగా బాధ్యతలు స్వీకరించిన గడ్డం ప్రసాద్

తెలంగాణ అసెంబ్లీ మూడో స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు  ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ ప్రకటించారు.