Guntur Karaam:దుమ్మురేపిన మహేష్.. 'గుంటూరు కారం' తొలి వారం వసూళ్లు ఎంతంటే..?
Send us your feedback to audioarticles@vaarta.com
సంక్రాంతి కానుకగా విడుదలైన 'గుంటూరు కారం' సినిమా కలెక్షన్స్‌లో దుమ్మురేపింది. మిక్స్‌డ్ టాక్ వచ్చినా మహేష్ బాబు స్టామినాతో థియేటర్లకు ప్రేక్షకులు క్యూకట్టారు. దీంతో వసూళ్లు పరంపర కొనసాగుతూనే ఉంది. ఇందులో మహేష్ డ్యాన్స్, నటన, స్వాగ్, స్లాంగ్ ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకున్నాయి. దీంతో టాక్ ఎలా ఉన్నా కానీ రికార్డ్ కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది. తొలిరోజే 94కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు రాబట్టి రీజినల్ చిత్రాల్లో రికార్డ్ కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. ఇక మొదటి మూడు రోజుల్లో అయితే 164.7 కోట్ల రూపాయలు వసూళ్లు సాధించి.. 200కోట్ల రూపాయలు దిశగా వెళ్తోంది.
తాజాగా తొలి వారం వసూళ్లు ఎంత వచ్చాయో చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. వారం రోజుల్లో రూ.212 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసినట్లు వెల్లడించింది. రమణగాడి సూపర్ సంక్రాంతి బ్లాక్‌బాస్టర్ అంటూ పోస్టర్ విడుదల చేసింది. ఒక్క భాషలోనే విడుదలైన ఒక రీజనల్ సినిమా ఈ రేంజ్ కలెక్షన్స్ వసూలు చేయడం ఇదే మొదటి సారి అని వెల్లడించింది. అంతేకాకుండా రూ.100 కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్ కూడా దక్కించుకుందని తెలిపింది. దీంతో వరుసగా 5 రీజనల్ సినిమాలతో రూ.100కోట్లు షేర్ దక్కించిన ఏకైక హీరోగా మహేష్ రికార్డ్ నెలకొల్పాడు. దీంతో మహేష్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించగా.. థమన్ సంగీతం అందించాడు. శ్రీలీల, మీనాక్షి చౌదరీలు హీరోయిన్లుగా నటించారు. రమ్యకృష్ణ మహేష్ తల్లిగా, జయరామ్ తండ్రిగా నటించారు. ప్రకాశ్ రాజ్ విలన్‌గా కనింపించారు. కాగా మహేష్ తన తర్వాతి సినిమాను పాన్ ఇండియా డైరెకర్ట్, జక్కన్న రాజమౌళితో మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను పాన్ వరల్డ్ రేంజ్‌లో తెరకెక్కించనున్నారు. ఇందులో మహేష్ జేమ్స్ బాండ్ తరహా క్యారెక్టర్ చేయనున్నారు. ఈ సినిమా తర్వాత మహేష్ మార్కెట్ ప్రపంచవ్యాప్తంగా పెరగనుంది. దీంతో భవిష్యత్‌తో మహేష్ ఏ రేంజ్ రికార్డు వసూళ్లు రాబడుతాడో వేచి చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com