First Day Collections: 'గుంటూరుకారం' వర్సెస్ 'హనుమాన్'.. తొలి రోజు వసూళ్లు ఎంతంటే..?
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ మహేశ్ బాబు(Mahesh Babu), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వచ్చిన 'గుంటూరు కారం'బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. మహేష్ వన్ మ్యాన్ షోతో అలరిస్తున్నాడు. అయితే సినిమాలో త్రివిక్రమ్ మార్క్ మ్యాజిక్ లేకపోవడంతో ఫ్యాన్స్ డిస్పాయింట్ అవుతున్నారు. కానీ ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనడంతో మూవీని తొలిరోజు చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు. దీంతో తొలి రోజు దుమ్మురేపే కలెక్షన్స్ వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్స్ తో కలిపి మొదటి రోజు ఏకంగా 94 కోట్ల రూపాయలు గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసినట్లు మేకర్స్ తెలిపారు.
ఒక్క భాషలోనే రిలీజైన రీజనల్ సినిమాకు రికార్టుస్థాయిలో తొలిరోజు కలెక్షన్స్ రావడం ఇదే మొదటిసారి అని ప్రకటించారు. గతంలో మహేష్ నటించిన 'సర్కారు వారి పాట' సినిమా కూడా మొదటి రోజు 75 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసి అప్పుడు రీజనల్ సినిమా రికార్డ్ సెట్ చేయగా.. ఇప్పుడు మళ్లీ గుంటూరు కారంతోనే ఆ రికార్డును బద్దలు కొట్టడం విశేషం. అటు అమెరికాలో కూడా ఈ సినిమా ఇప్పటికే 1.8 మిలియన్ డాలర్స్ వసూళ్లు చేసి దూసుకెళ్తుంది. అయితే సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చినా సంక్రాంతి సెలవులు కావడంతో మూవీ వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు.
సినిమాకు సూపర్ హిట్ టాక్ వచ్చే ఉంటే మాత్రం మరో రేంజ్‌లో వసూళ్లు ఉండేవని చెబుతున్నారు. దాదాపు రూ.150కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు లాభాలు రావాలంటే దాదాపు రూ.250-300 కోట్లు వసూళ్లు రాబట్టాలి. అయితే ఓవరాల్‌గా రూ.250 కోట్లు వసూలు చేయవచ్చని అంచనా వేస్తున్నారు. కానీ ఈ సినిమాతో పాటు రిలీజ్ అయిన 'హనుమాన్' చిత్రానికి బ్లాక్‌బాస్టర్ టాక్ రావడంతో తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల సంఖ్య పెంచుతున్నారు. మరోవైపు 'సైంధవ్', 'నా సామిరంగ' సినిమాలు కూడా ఉండటంతో వసూళ్లు ఏ మేరకు రాబడుతుందో వేచి చూడాలి.
ఇక ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా నటించిన 'హనుమాన్' చిత్రం అయితే దుమ్మురేపుతోంది. యునామినస్ బ్లాక్‌బాస్టర్ టాక్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ముఖ్యంగా మూవీలోని గ్రాఫిక్స్, విజువల్స్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఆ సీన్స్ చాలా నేచురల్‌గా ఉన్నాయని.. ఎక్కడా గ్రాఫిక్స్ అనే ఆలోచన కూడా రాదని కొనియాడుతున్నారు. కొన్ని సీన్స్ అయితే గూస్‌బంప్స్ తెప్పించాయంటున్నారు. ఆంజనేయస్వామి షాట్స్ అయితే నభూతో నభవిష్యతీ అని ప్రశంసిస్తున్నారు. కేవలం తక్కువ బడ్జెట్‌లో ఇటువంటి విజువల్ క్వాలిటీ సీన్స్ తీయడం శభాష్ అంటున్నారు. ఇంత నేచురల్‌గా సన్నివేశాలు డిజైన్ చేయడం మామూలు విషయం కాదని.. ప్రశాంత్ వర్మ టాలెంట్‌కు సెల్యూట్ చేస్తున్నారు.
అయితే చిన్న సినిమా కావడం, థియేటర్లు తక్కువగా దొరకడంతో వసూళ్లపై ప్రభావం చూపింది. అయినా కానీ ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు రూ.21కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఈరోజు నుంచి థియేటర్లు సంఖ్య పెంచడంతో మరిన్ని వసూళ్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. అటు నార్త్‌లో కూడా ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా రామాయాణాన్ని ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్లు చూపించిన విధానం, గ్రాఫిక్స్, వీఎఫ్‌క్స్‌కు ఫిదా అయిపోతున్నారు. హిందీలో కూడా హిట్ టాక్ రావడంతో ఈ సినిమా కచ్చితంగా రూ.100కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడం ఖాయమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో మహేష్‌బాబు ఓ మోస్తరుగా సత్తా చాటితే, తేజ సజ్జా మాత్రం దేశవ్యాప్తంగా అదరగొడుతున్నాడనే చెప్పాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments