Guntur Kaaram:'కుర్చీ మడతపెట్టి..'ఫుల్ సాంగ్ వచ్చేసిందిగా.. ఫ్యాన్స్‌కు పూనకాలే..

  • IndiaGlitz, [Saturday,December 30 2023]

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్‌ను ఉర్రుతలూగించే సాంగ్ వచ్చేసింది. న్యూ ఇయర్ కానుకగా 'కుర్చీ మడతపెట్టి..' పుల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. గురువారం ఈ సాంగ్ ప్రోమో విడుదల చేసినప్పటి నుంచి 'కుర్చీని మడత పెట్టి..' పదం వాడకంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కొంతమంది తీవ్రంగా విమర్శలు చేయగా.. మరికొందరు మాస్ సాంగ్ అదిరిపోయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి సినిమాకు మాత్రం ఫుల్ పబ్లిసిటీ లభించింది. ఇక తాజాగా రిలీజైన పాటలో మహేశ్, శ్రీలల డ్యాన్స్ అదిరిపోయింది. ఇద్దరూ పోటాపోటీగా స్టెప్పులు ఇరగదీశారు. వీరి డ్యాన్స్ చూస్తుంటే థియేటర్లలో విజిల్స్ మోత మోగడం ఖాయం.

థమన్ మాంచి మాస్ బాణీ అందించగా సాహితి చాగంటి, శ్రీ కృష్ణ ఆలపించారు. రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ రాశారు. ఇకమ పాట మధ్యలో మహేష్ బాబు 'ఏంది అట్టా సూత్తన్నావ్. ఇక్కడ ఎవడి బాధలకు వాడే లిరిక్ రైటర్. రాసుకోండి.... మడతెట్టి పడేయండి' అంటూ డైలాగ్ చెప్పి మరింత ఊపు తీసుకొచ్చారు. మొత్తానికి పాట మాత్రం ఫ్యాన్స్‌కు పూనకాలే అన్నట్లు ఉంది. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు కూడా అభిమానులను ఆకట్టుకోవడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇక సినిమా విషయానికొస్తే అతడు, ఖలేజా సినిమాల తర్వాత మహేష్- త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న మూడో సినిమా 'గుంటూరు కారం'. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శ్రీలీల మెయిన్ లీడ్‌గా, మీనాక్షి చౌదరి సెకండ్ హీరోయిన్‌గా ఇందులో నటిస్తున్నారు. మహేష్ బాబును గతంలో ఎప్పుడూ చూడని విధంగా మాస్ అవతారంలో ఈ మూవీలో త్రివిక్రమ్ చూపించున్నారని ఫిల్మ్ నగర్ టాక్. దీంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా 2024, జనవరి 12న మూవీ విడుదల కానుంది.

More News

Modi:అమృత భారత్ రైళ్లు ప్రారంభించిన ప్రధాని మోదీ

అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం ముందుగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ(PM Modi) శ్రీకారం చుట్టారు.

Tamilisai:రాజీనామా వార్తల్లో నిజం లేదు: గవర్నర్ తమిళిసై క్లారిటీ

తాను గవర్నర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు వస్తున్న వార్తలను తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ తీవ్రంగా ఖండించారు.

YS Jagan: మంచి మనసు చాటుకున్న సీఎం జగన్.. గంటలోనే సమస్యకు పరిష్కారం..

సీఎం జగన్ మోహన్ రెడ్డి(CM Jagan Mohan Reddy) మరోసారి మానవత్వం చాటుకున్నారు. జిల్లాల పర్యటనలో భాగంగా ఆపదలో ఉన్నామని వచ్చిన వారి వినతలు స్వీకరిస్తూ...

BTech Ravi: నన్ను చంపేందుకు సీఎం జగన్ కుట్ర చేస్తున్నారు: బీటెక్ రవి

తనను అంతమొందించేందుకు సీఎం జగన్ కుట్ర చేస్తున్నారని టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి సంచలన ఆరోపణలు చేశారు. ఇందులో భాగంగానే తన గన్‌మెన్లను తొలగించారని మండిపడ్డారు.

Pawan Kalyan:జగన్ ప్రభుత్వం అవినీతిపై ప్రధాని మోదీకి పవన్ కల్యాణ్ ఫిర్యాదు

ఏపీలో పేదలకు ఇళ్ల నిర్మాణం పేరిట భారీ కుంభకోణం జరిగిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్(PawanKalyan) ప్రధాని మోదీ(PM Modi)కి ఫిర్యాదుచేశారు.