Guntur Kaaram:'కుర్చీ మడతపెట్టి..'ఫుల్ సాంగ్ వచ్చేసిందిగా.. ఫ్యాన్స్‌కు పూనకాలే..
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్‌ను ఉర్రుతలూగించే సాంగ్ వచ్చేసింది. న్యూ ఇయర్ కానుకగా 'కుర్చీ మడతపెట్టి..' పుల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. గురువారం ఈ సాంగ్ ప్రోమో విడుదల చేసినప్పటి నుంచి 'కుర్చీని మడత పెట్టి..' పదం వాడకంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కొంతమంది తీవ్రంగా విమర్శలు చేయగా.. మరికొందరు మాస్ సాంగ్ అదిరిపోయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి సినిమాకు మాత్రం ఫుల్ పబ్లిసిటీ లభించింది. ఇక తాజాగా రిలీజైన పాటలో మహేశ్, శ్రీలల డ్యాన్స్ అదిరిపోయింది. ఇద్దరూ పోటాపోటీగా స్టెప్పులు ఇరగదీశారు. వీరి డ్యాన్స్ చూస్తుంటే థియేటర్లలో విజిల్స్ మోత మోగడం ఖాయం.
థమన్ మాంచి మాస్ బాణీ అందించగా సాహితి చాగంటి, శ్రీ కృష్ణ ఆలపించారు. రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ రాశారు. ఇకమ పాట మధ్యలో మహేష్ బాబు 'ఏంది అట్టా సూత్తన్నావ్. ఇక్కడ ఎవడి బాధలకు వాడే లిరిక్ రైటర్. రాసుకోండి.... మడతెట్టి పడేయండి' అంటూ డైలాగ్ చెప్పి మరింత ఊపు తీసుకొచ్చారు. మొత్తానికి పాట మాత్రం ఫ్యాన్స్‌కు పూనకాలే అన్నట్లు ఉంది. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు కూడా అభిమానులను ఆకట్టుకోవడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇక సినిమా విషయానికొస్తే అతడు, ఖలేజా సినిమాల తర్వాత మహేష్- త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న మూడో సినిమా 'గుంటూరు కారం'. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శ్రీలీల మెయిన్ లీడ్‌గా, మీనాక్షి చౌదరి సెకండ్ హీరోయిన్గా ఇందులో నటిస్తున్నారు. మహేష్ బాబును గతంలో ఎప్పుడూ చూడని విధంగా మాస్ అవతారంలో ఈ మూవీలో త్రివిక్రమ్ చూపించున్నారని ఫిల్మ్ నగర్ టాక్. దీంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా 2024, జనవరి 12న మూవీ విడుదల కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com