కె.రాఘవేంద్రరావు చేతుల మీదుగా 'గున్న' లోగో ఆవిష్కరణ

  • IndiaGlitz, [Friday,February 02 2018]

సాలగ్రామ్‌ సినిమా పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం గున్న'. విప్లవ్‌.కె దర్శకత్వం వహిస్తున్నారు. నేపథ్యాన్ని, పాత్రల స్వభావాన్ని తెలిపేందుకు రూపొందించిన ప్రీ పోస్టర్‌ను, లోగోను సీనియర్‌ దర్శకుడు కె. రాఘవేంద్రరావు శుక్రవారం విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ లోగో డిజైన్‌ బావుంది. సినిమా చక్కని విజయాన్ని అందుకుని టీమ్‌కు మంచి పేరు, నిర్మాతకు లాభాలు రావాలి'' అని అన్నారు.

దర్శకుడు మాట్లాడుతూ 16 ఏళ్ల వయసులా నిత్యనూతనంగా ఆలోచించే రాఘవేంద్రరావుగారి చేతులమీదుగా పోస్టర్‌ విడుదల చేయడం ఆనందంగా ఉంది. పసి వయసుకు, యుక్త వయసుకు మధ్య గున్న ప్రాయంలో ఉన్న కొందరు స్నేహితుల కథతో తెరకెక్కనున్న చిత్రమిది. సినిమాకు సంబంధించి ప్రధాన పాత్రల ఎంపిక ఎనిమిది నెలలుగా జరుగుతోంది. సామ్రాట్‌, ప్రజ్ఞాత, నిఖిల్‌, ఆర్మాన్‌, మెహక్‌, ఐశ్వర్యలను ఎంపిక చేశాం. త్వరలో మిగిలిన ఇద్దరు ఆర్టిస్ట్‌లను ఎంపిక చేసి మార్చిలో షూటింగ్‌ ప్రారంభిస్తాం'' అని తెలిపారు.

కేఎస్వీ సమర్పిస్తున్న ఈ చిత్రానికి పబ్లిసిటీ డిజైనర్‌: సుధీర్‌; కాస్టింగ్‌ డైరెక్టర్‌: హర్ష ఉప్పలూరి, సంగీతం: శ్రీచరణ్‌ పాకాల, పాటలు: డా.జివాగో, డిఓపి: భరణి.కె.ధరన్‌, ఎడిటింగ్‌: ధర్మేంద్ర కాకరాల, నిర్మాణ నిర్వాహణ, లైన్‌ ప్రొడ్యూసర్‌: సి.హెచ్‌.వి.ఎస్‌.ఎన్‌.బాబ్జీ, నిర్మాణం సాలగ్రామ్‌ సినిమా.

More News

కళాశాల నేపథ్యంలో చిరు అల్లుడి సినిమా

మెగాస్టార్ చిరంజీవి చిన్న అల్లుడు కళ్యాణ్ దేవ్ తెలుగు తెరకు కథానాయకుడుగా పరిచయం కానున్న సంగతి తెలిసిందే.

ఈ నెలలోనే రవితేజ, శ్రీను వైట్ల మూవీ

మాస్ మహారాజా రవితేజ,డెబ్యు డైరెక్టర్ విక్రమ్ సిరికొండ కాంబినేషన్లో తెరకెక్కిన మూవీ ‘టచ్ చేసి చూడు’.

చరణ్ , బోయపాటి.. ఓ ఐటమ్ సాంగ్

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్,మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కలయికలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

రిలీజ్ కు ముందే ఓ చిన్న చిత్రానికి క్రేజీ ఆఫర్స్!!

ఓ నూతన దర్శకుడు,నూతన నిర్మాణ సంస్థలో రూపొందిన 'ఇంతలో ఎన్నెన్ని వింతలో'

జాతీయ మహిళా సదస్సు 2017...శిల్పారామం...హైదరబాద్

ఫ్రగ్న్యా భారతి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జాతీయ మహిళా సదస్సు Feb 1 వ తేదీ నుంచి 3వ తేదీ వరకు హైదరబాద్ లోని శిల్ప కలా వేదిక యందు ఘనగా జరుగుతున్నాయి.