గుండు హనుమంతరావుకి ఆర్థిక సాయం
Send us your feedback to audioarticles@vaarta.com
గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధ పడుతున్న ప్రముఖ హాస్యనటుడు గుండు హనుమంతరావుకు తెలంగాణ ప్రభుత్వం 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించింది. ఆయన చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఈ నగదు మొత్తాన్ని విడుదల చేసింది. ఈ విషయాని పురపాలక శాఖమంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
గుండు హనుమంతరావు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హనుమంతరావుకి వారానికి మూడు సార్లు డయాలసిస్ చెయ్యాల్సి వుంటుందని వైద్యులు సూచించారు. దానికి అయ్యే ఖర్చుని భరించే పరిస్థితి లేకపోవడంతో ఇంట్లోనే ఉంటూ చికిత్స పొందుతున్నారు. ఇది గవునించిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేుషన్ హనుమంతరావు పరిస్థితిని హీరో చిరంజీవి దృష్టికి తీసుకెళ్ళారు. వెంటనే స్పందించిన చిరంజీవి 2 లక్షల రూపాయలు అందించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com