గుణశేఖర్ దారెటు?
Send us your feedback to audioarticles@vaarta.com
రుద్రమదేవి`తో ప్రేక్షకులతో పాటు, విమర్శకులు ప్రశంసలు అందుకున్న గుణశేఖర్ తదుపరి ఏ చిత్రాన్ని చేస్తాడో తెలియడం లేదు. రుద్రమదేవికి సీక్వెల్ ప్రతాపరుద్రుడు` చిత్రాన్ని చేస్తాడని వార్తలు వినిపించాయి. ప్రతాపరుద్రుడు` కథ బావుంటే దాన్ని నేనే ప్రొడ్యూస్ చేస్తానని కూడా దిల్ రాజు ప్రకటించారు.
అయితే రీసెంట్ గా గుణశేఖర్ వీరాభిమన్యు` అనే టైటిల్ ను గుణా టీమ్ వర్క్స్ పై రిజిష్టర్ చేయించారు. దీంతో అసలు గుణశేఖర్ ప్రతాపరుద్రుడు` సినిమా తీస్తాడా లేక వీరాభిమన్యు సినిమా డైరెక్ట్ చేస్తాడా అనే డౌట్ చాలా మందిలో ఉత్పన్నమయ్యింది. మరి గుణశేఖర్ దారెటో?
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments