close
Choose your channels

అందుకనే 'రుద్రమదేవి' చరిత్రను వక్రీకరించకుండా చిత్రీకరించాను - గుణ శేఖర్

Sunday, October 4, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అందాల తార అనుష్క ప్ర‌ధాన పాత్ర‌లో గుణ శేఖ‌ర్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందించిన భారీ చారిత్రాత్మ‌క చిత్రం రుద్ర‌మ‌దేవి. ఈ సినిమాలో రానా, అల్లు అర్జున్, క్రిష్ణంరాజు, నిత్యామీన‌న్ త‌దిత‌రులు ముఖ్య‌పాత్ర‌లు పోషించారు. గుణ శేఖ‌ర్ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన రుద్ర‌మ‌దేవి చిత్రాన్ని ఈనెల 9న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు.ఈ సంద‌ర్భంగా రుద్ర‌మ‌దేవి టీం చెప్పిన స‌మ్ గ‌తులు మీకోసం...

రుద్ర‌మ‌దేవి 2డి & 3డి ఒకేసారి రిలీజ్..

డైరెక్ట‌ర్ గుణ శేఖ‌ర్ మాట్లాడుతూ...రుద్ర‌మ‌దేవి సినిమాకి సెన్సార్ బోర్డ్ వారు యు ఎ స‌ర్టిఫికెట్ ఇచ్చారు. రుద్ర‌మ‌దేవి సినిమాకి రెండు సార్లు సెన్సార్ జ‌రిగింద‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఆ వార్త‌ల్లో వాస్త‌వం లేదు. రుద్ర‌మ‌దేవి ట్రైల‌ర్ కి ఒక‌సారి, సినిమాకి మ‌రోసారి సెన్సార్ జ‌రిగింది. అంతే కాని సినిమాకే రెండు సార్లు సెన్సార్ జ‌ర‌గ‌లేదు.ఈ సినిమా నిడివి 2 గంట‌ల 37 నిమిషాలు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఈనెల 9న తెలుగు, త‌మిళ‌, మ‌ళ‌యాల‌, హిందీ భాష‌ల్లో రుద్ర‌మ‌దేవి చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాం. రుద్ర‌మ‌దేవి 2డితో పాటు 3డి కూడా ఒకేసారి రిలీజ్ చేస్తున్నాం అన్నారు.

9 ఏళ్లు ప‌రిశోధ‌న‌..

13వ శ‌తాబ్ధం కాక‌తీయులకు సంబంధించిన చ‌రిత్ర‌ను వ‌క్రీక‌రించ‌కుండా 9 ఏళ్లు పాటు ప‌రిశోధ‌న చేసి ఈ సినిమాని రూపొందించాం .డా ముదికొండ శివ‌ప్ర‌సాద్, మ‌ధుబాబు కొంత‌మంది చ‌రిత్ర‌కారుల స‌ల‌హాలు సూచ‌న‌లు తీసుకున్నాను అని డైరెక్ట‌ర్ గుణ శేఖ‌ర్ తెలిపారు. రుద్ర‌మ‌దేవి గురించి అంతా ఒకే పుస్త‌కంలో లేదు. ఒక్కొ పుస్త‌కంలో ఒక్కొలా ఉంది. అయితే పుస్త‌కాల్లో పొర‌పాట్లు జ‌ర‌గ‌వ‌చ్చు. కానీ శిలాశాస‌నాల్లో అలా జ‌ర‌గ‌దు. క‌నుక శిలా శాస‌నాల‌ను ప్రామాణికంగా తీసుకుని రుద్ర‌మ‌దేవి క‌థ‌ను త‌యారుచేసాను అన్నారు.

నిజ‌మే..గుప్త‌నిధి దొరికింది..

రుద్ర‌మ‌దేవి క‌థ‌ను 2 గంట‌ల 37 నిమిషాల నిడివిలో చెప్ప‌డం చాలా క‌ష్టం. అయినా చెప్పే ప్ర‌య‌త్నం చేసాను. కొన్ని కోట్లు ఖ‌ర్చు పెట్టి రుద్ర‌మదేవి చిత్రాన్ని నేనే స్వ‌యంగా నిర్మించానంటే న‌న్ను ఎంత ప్ర‌భావితం చేసిందో అర్ధం చేసుకోవ‌చ్చు.నేను బాగా ప్ర‌భావితం అయిన అంశాల‌ను ప్రేక్ష‌కుల‌ను కూడా ప్ర‌భావితం చేసేలా చెప్ప‌డం జ‌రిగింది.ఈ సినిమాలో ప్రాత‌ల మ‌ధ్య సంఘ‌ర్ష‌ణ‌, రుద్ర‌మ‌దేవి చేసిన త్యాగం ఇవ‌న్నీ ప్రేక్స‌కుల‌ను బాగా ఆక‌ట్టుకుంటాయి. 40 సంవ‌త్స‌రాలు ఏ రాణి కూడా పాలించ‌లేదు. అలాంటిది రుద్ర‌మ‌దేవి అన్ని సంవ‌త్స‌రాలు ఎలా పారిపాల‌న చేయ‌గ‌లిగింది. ఇలాంటి ఎన్నో ఆస‌క్తిక‌ర విష‌యాలు ఉంటాయి అన్నారు గుణ శేఖ‌ర్. కొంత మంది గుణ‌శేఖ‌ర్ కి గుప్త నిధి దొరికుంటుంది. అందుక‌నే ఇంత ఖర్చుతో రుద్ర‌మ‌దేవి సినిమాని తీసాడు అంటున్నారు. నిజ‌మే..నాకు కాక‌తీయుల క‌ధ అనే గుప్త‌నిధి దొరికింది అన్నారు.

రానాలో స‌రికొత్త యాంగిల్..

రానా మోడ్ర‌న్ గా ఉంటాడు. అలాగే లిట‌రేచ‌ర్ పై మంచి ప‌ట్టు ఉంది.రానాకి ఈ క‌థ చెప్పిన‌ప్పుడు త‌న‌కు ఎంత వ‌ర‌కు ప్ల‌స్ అవుతుందని ఆలోచించ‌లేదు.ఇలాంటి జోన‌ర్ సినిమాలు రావాలి అంటూ న‌న్ను ఎంత‌గానో ప్రొత్స‌హించాడు. నాకు అండ‌గా నిలిచిన రానా స‌హ‌కారం మ‌రువ‌లేనిది. రానాలో స‌రికొత్త రొమాంటిక్ యాంగిల్ ఈ సినిమాలో చూస్తారు. రానా, అనుష్క ల పెయిర్ స్ర్కీన్ పై చూడాల్సిందే.

ఇలా చారిత్రాత్మ‌క చిత్రాలు తీయాల‌నుకునేవారికి రుద్ర‌మ‌దేవి సినిమా ఆద‌ర్శం కావాలి. అందుక‌నే చ‌రిత్ర‌ను వ‌క్రీక‌రించ‌కుండా...చిత్రీక‌రించాను. అన్నారు గుణ శేఖ‌ర్.

ద‌టీజ్ చిరంజీవి గారు..

ఈ సినిమాకి వాయిస్ ఓవ‌ర్ ఎవ‌రుతో చెప్పిస్తే బాగుంటుందని ఆలోచిస్తున్న‌ప్పుడు బ‌న్ని చిరంజీవిగారితో చెప్పిస్తే బాగుంటుంద‌ని స‌ల‌హా ఇచ్చాడు.ఆత‌ర్వాత చిరంజీవిగారిని క‌లిసి..మీరు రుద్ర‌మ‌దేవికి మీరు వాయిస్ ఓవ‌ర్ చెబితే బాగుంటుంద‌ని అడ‌గానే ఏమాత్రం ఆలోచించ‌కుండా వెంట‌నే ఓకె అన్నారు. అంతే కాదు...రుద్ర‌మ‌దేవి సినిమాకి నావ‌ల్ల నీకు ఏది కావాలో చెప్పు చేస్తాన‌న్నారు. మంచి సినిమాకి ఏదైనా చేయాల‌నే త‌ప‌న ఆయ‌న‌ది. సినిమా అంటే అంత ప్రాణం ద‌టీజ్ చిరంజీవి గారు.

రుద్ర‌మ‌దేవి అంటే అనుష్క‌నే..

రానా మాట్లాడుతూ... శ్రీక్రిష్ణుడు ఎలా ఉంటాడు అంటే ఎన్టీఆర్ సినిమాలు చూసి...అల్లూరి సీతారామ‌రాజు ఎలా ఉంటాడు అంటే క్రిష్ణ‌గారి సినిమా చూసి తెలుసుకున్నాను. నేను ఏది తెలుసుకున్నా..సినిమాల ద్వారానే తెలుసుకున్నాను. ఆర్టిస్టులు. సాంకేతిక నిపుణులు అంద‌రూ చాలా క‌ష్ట‌ప‌డి రుద్ర‌మ‌దేవి సినిమా చేసాం.అంద‌రూ ఈ సినిమాని చూడాలి. రానున్న త‌రంలో రుద్ర‌మ‌దేవి ఎలా ఉంటుందంటే అనుష్క‌లా ఉంటుంద‌ని చెబుతారు అన్నారు.

అనుష్క త‌ప్ప వేరే వారు చేయ‌లేరు..

అల్లు అర్జున్ మాట్లాడుతూ... మంచి సినిమా అంటే నాకు చాలా ఇష్టం. అందుక‌నే మంచి సినిమాకి నావంతు స‌హ‌కారం అందించాల‌నే ఉద్దేశ్యంతోనే రుద్ర‌మ‌దేవి సినిమా చేసాను.రుద్ర‌మ‌దేవి సినిమాను క‌మ‌ర్షియ‌ల్ గా అంద‌రికీ అర్ధం అయ్యేలా గుణ శేఖ‌ర్ అద్భుతంగా తెర‌కెక్కించారు.రుద్ర‌మ‌దేవి పాత్ర‌ను సౌతిండియాలో అనుష్క ఒక్క‌రే చేయ‌గ‌ల‌రు. ఈ సినిమా కోసం అనుష్క చాలా క‌ష్ట‌ప‌డింది. బాహుబ‌లి క‌న్నా ముందే ఈ సినిమాలో న‌టించేందుకు అంగీక‌రించిన రానాకు థ్యాంక్స్ తెలియ‌చేస్తున్నాను అన్నారు.

అంత‌కు మించి ఏమీ వ‌ద్దు..

ఈ సినిమాలో స్వ‌చ్ఛ‌మైన తెలంగాణ యాస‌లో మాట్లాడాను. సిటీలో మాట్లాడే తెలంగాణ యాస్ ఒక‌లా ఉంటుంది. గ్రామాల్లో మాట్లాడే తెలంగాణ యాస మ‌రోలా ఉంటుంది. గ్రామాల్లో మాట్లాడే తెలంగాణ యాస‌లో మాట్లాడేందుకు ప్ర‌య‌త్నించాను. బ‌న్ని ఓ మంచి పాత్ర చేసాడ‌నే పేరు వ‌స్తే చాలు అంత‌కు మించి ఈ సినిమా నుంచి నేను ఏమీ ఆశించ‌డం లేదు అన్నారు.

అనుష్క మాట్లాడుతూ... చారిత్ర‌త్మ‌క సినిమాలో న‌టించ‌డం చాలా ఆనందంగా ఉంది.రానా, బ‌న్ని..మంచి స‌హ‌కారాన్ని అందించారు. గుణ శేఖ‌ర్ గారు ఎంతో క‌ష్ట‌ప‌డి ఈ సినిమాని రూపొందించారు.అంద‌రికీ రుద్ర‌మ‌దేవి న‌చ్చుతుంద‌ని అనుకుంటున్నాను అన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment