'శకుంతల'గా సమంత కరెక్ట్ కాదనుకున్నా.. ఆ రెండు ప్రాజెక్ట్స్ పక్కా!
Send us your feedback to audioarticles@vaarta.com
భారీ చిత్రాల దర్శకుడు గుణశేఖర్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా గుణశేఖర్ తన చిత్రాల గురించి ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. ప్రస్తుతం గుణశేఖర్ పౌరాణిక నేపథ్యంలో 'శాకుంతలం' అనే భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దుశ్యంతుడు, శకుంతల కథ ఎంతో ఆసక్తిగా ఉంటుంది.
ఈ చిత్రంలో సమంత ప్రధాన పాత్రలో టైటిల్ రోల్ ప్లే చేస్తోంది. గుణశేఖర్ పెద్ద కుమార్తె నీలిమ ఈ చిత్రానికి నిర్మాత. ఈ చిత్రానికి సమంతని ఎంపిక చేయాలని తన కుమార్తే చెప్పిందని గుణశేఖర్ అన్నారు. కానీ సమంత అల్ట్రా మోడ్రన్ అమ్మాయి. శకుంతలగా సమంతని ఊహించుకోలేకపోయా.
రంగస్థలంలో రామలక్ష్మి పాత్ర చూడమని నా కూతురు చెప్పింది. రామలక్ష్మి పాత్ర చూశాక సమంతపై నా ఒపీనియన్ మారిపోయింది. తనని తాను ఎలాగైనా మార్చుకోగలిగే సత్తా ఉన్న నటి సమంత అని గుణశేఖర్ అన్నారు. ఈ పాత్ర కోసం సమంత రెండు నెలలు ప్రిపేర్ అయినట్లు తెలిపారు.
ఇదీ చదవండి: యూరప్‌లో ఎవరితో ఉన్నదీ చెప్పని విజయ్ దేవరకొండ
ఇప్పటికి ఈ చిత్రం 50 శాతం షూటింగ్ పూర్తయింది. మరో మూడు నెలల్లో మిగిలిన 50 శాతం పూర్తి చేస్తాం. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ కి 10 నెలల టైం పడుతుంది అని గుణశేఖర్ అన్నారు.
అలాగే తన తదుపరి చిత్రాల గురించి కూడా ఆయన చెప్పారు. 'హిరణ్యకశ్యప' ఆగిపోయిందంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు. శాకుంతలం పూర్తి కాగానే హిరణ్యకశ్యప ఉంటుంది. ఆ తర్వాత ' ప్రతాపరుద్రుడు' అని గుణశేఖర్ అన్నారు. అంటే గుణశేఖర్ తదుపరి మూడు చిత్రాలు హిస్టారికల్ నేపథ్యంలో తెరకెక్కేవే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com