మళ్లీ పోస్ట్ పోన్ అయింది...
Send us your feedback to audioarticles@vaarta.com
అనుష్క టైటిల్ పాత్రలో గుణా టీమ్ వర్క్స్ బ్యానర్‌పై గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం రుద్రమదేవి`. ఇండియాస్ ఫస్ట్ హిస్టారికల్ త్రీడీ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రంలో స్టయిలిష్ స్టార్ అల్లుఅర్జున్ గోనగన్నారెడ్డిగా, రానా దగ్గుబాటి చాళుక్య వీరభద్రుడి పాత్రలో నటించారు. ఈ సినిమాకి మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించారు.
ఈ సినిమా ఎప్పుడో పూర్తి కావాల్సింది. అయితే మధ్యలో బాహుబలి వంటి భారీ సినిమా రిలీజ్ వల్ల థియేటర్స్ సమస్య, చిన్న చిన్న టెక్నికల్ డెవలప్ మెంట్స్, ఆర్ధిక సమస్యలు అన్నీ కలిసి సినిమా విడుదలను వాయిదా వేస్తూ వచ్చాయి. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 4న వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో విడుదల చేయడానికి దర్శక నిర్మాత గుణశేఖర్ ప్లాన్ చేశాడు. అయితే ఏమైందో ఏమో కానీ తాజాగా ఈ సినిమా సెప్టెంబర్ 11న కానీ లేదా 18న కానీ విడుదలయ్యే అవకాశం ఉందని ఫిలింనగర్ లో వార్తలు వినపడ్డాయి. చివరికి సినిమాని అక్టోబర్ చివరి వారంలో విడుదల చేయాలని గుణశేఖర్ అండ్ టీమ్ యోచిస్తుందట. అసలు సినిమా విడుదలకు ఇన్ని వాయిదాలేంటో గుణశేఖర్ కే తెలియాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com