గల్ఫ్ అవగాహనా యాత్ర పోస్టర్ ఆవిష్కరణ
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రముఖ దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం గల్ఫ్ వచ్చే నెల జులై లో విడుదలకి సిద్ధం అవుతోంది. ఈ లోగా చిత్ర నిర్మాతలు గల్ఫ్ చిత్రం ప్రచారం మొదలుపెట్టారు. చిత్ర నిర్మాతలు గల్ఫ్ అవగాహనా యాత్ర పోస్టర్ ని సిరిసిల్ల జిల్లా లో విడుదల చేసారు.
జిల్లా ఎస్పీ కుంపటి విశ్వజిత్ గల్ఫ్ అవగాహనా యాత్ర పోస్టర్ ని విడుదల చేయగా, చిత్ర దర్శక నిర్మాతలు తమ గల్ఫ్ చిత్రం గురించి వివరించారు. ఈ చిత్రం లో గల్ఫ్ లో ప్రవాస భారతీయలు ఉపాధి కోసం వెళ్లి ఏ విధంగా కష్ట నష్టాలని ఓర్చుకొని జీవితం వెళ్లదీస్తున్నారో సవివరంగా చూపెట్టమని చెప్పారు.
దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 9 వ తేదీన సిరిసిల్ల లో చిత్ర నటీ నటులు మరియు సాంకేతిక నిపుణులు పాల్గొంటారని తెలిపారు. పోస్టర్ విడుదల కార్యక్రమానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ బాపి రాజు, గల్ఫ్ చిత్రం తెలంగాణ అంబాసడర్ చీటి సతీష్ బాబు, భూమా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com