ఆర్భాటంగా 'గల్ఫ్' పాటల విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
చేతన్ మద్దినేని, డింపుల్ చోపడే, సంతోష్ పవన్ లు నటించిన గల్ఫ్ ఆగస్టు లో విడుదలకి సిద్ధం అవుతోంది. సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం చిత్రసీమలో ఆసక్తి రేకెత్తిస్తున్న విషయం తెలిసినదే. ఇప్పటికే నిర్మాతలు ప్రజలలో చైతన్యం కలిగించడానికి గల్ఫ్ ప్రవాసీ అవగాహనా యాత్ర, తెలంగాణ,ఆంధ్ర రాష్ట్రాలలో స్పందన పుట్టిస్తోంది.
చిత్ర నిర్మాతలు గల్ఫ్ పాటలని ఆర్భాటంగా నిన్న సాయంత్రం జులై 25 , ప్రసాద్ లాబ్స్,హైదరాబాద్ లో ప్రముఖుల సమక్షంలో విడుదల చేసారు. గల్ఫ్ దేశ వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ ఆడియో వేడుకని ఆహుతులు ఆకట్టుకునే విధంగా జరుపుకున్నారు. ఆల్బంలో నాలుగు పాటలని సిరాశ్రీ, కాసర్ల శ్యామ్, మాస్టర్జీ మరియు అరబిక్ పాటని కువైట్ కి చెందిన అహమద్ రచించారు. కె.ఎం.రాధాకృష్ణన్, అంజనా సౌమ్య, దీపు,గీత మాధురి, ధనుంజయ్, హన్సిక పాటలని మనోహరంగా ఆలపించారు.
ముఖ్య అతిధులు నాగినీడు,తోటపల్లి మధు, దుబాయ్ కి చెందిన వ్యాపారవేత్త శ్రీరామ్ పాటలని విడుదల చేయగా, ఆర్టిస్టులు ఆల్బంని ఎల్. బి. శ్రీరామ్ ,మరియు బిగ్ సి.డి ని దర్శకుడు మారుతి విడుదల చేసారు.
ఈ చిత్రంలో ప్రముఖ పాత్ర పోషించిన నాగినీడు మాట్లాడుతూ సునీల్ కుమార్ రెడ్డి ఈ చిత్రాన్నై మనసుకి హత్తుకునే విధంగా మలిచాడని, అన్ని పాటలు విభిన్నంగా ఉన్నాయని అంటూ, సునీల్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రేమతో తీసాడని తెలిపాడు.
ఎల్.బి. శ్రీరామ్ మాట్లాడుతూ సునీల్ కుమార్ రెడ్డి తనకి మంచి స్నేహితుడని, అతడి చిత్రాలలోని మానవ సంబంధాలు తనకి ఎంతో ఇష్టమని అంటూ, గల్ఫ్ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపాడు. దుబాయికి చెందిన వ్యాపారవేత్త శ్రీరామ్ పాట్లాడుతూ ఇన్నేళ్ళుగా తాను జీవించి ఉన్న గల్ఫ్ ని ఎంతో అందంగా గల్ఫ్ చిత్రంలో చూపించారని,. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాలలోని కాకుండా, ఎన్ని భాషల సబ్ టైటిల్స్ తో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలన్నారు.
దర్శకుడు మారుతి మాట్లాడుతూ సునీల్ ఈ చిత్రాన్ని రెండేళ్లు కష్టపడి ఎంతో పరిశోధించి తీసాడని, ఈ చిత్రంలో మానవీయ సంబంధాలు, సామజిక అంశాలకి, కమర్షియల్ హంగులు అద్ది అద్భుతంగా తీసాడని చెప్పాడు. ఈ చిత్రం హీరో చేతన్ మద్దినేని మంచి పేరు తెస్తుందని ఆకాంక్షించారు.
సంగీత దర్శకుడు ప్రవీణ్ ఇమ్మడి మాట్లాడుతూ శ్రావ్య ఫిలిమ్స్ బ్యానేర్ లో తాను గంగ పుత్రులు నుండి ఎనిమిది చిత్రాలకి పనిచేశానని,ఈ చిత్రంలో పాటలకి బాణీలు సమకూర్చడంతో పాటు రి రికార్డింగ్ కి మంచి అవకాశం వచ్చిందని అన్నాడు.
చేతన్ మద్దినేని మాట్లాడుతూ తన మొదటి చిత్రం రోజులు మారాయి తర్వాత ఇంత మంచి అవకాశం రావడం తన అదృష్టమని తెలిపాడు. తన పాత్ర రెండు రాష్ట్రాల తెలుగు ప్రజల భావోద్వేగాల్నితెరపై ఆవిష్కరిస్తుంది అన్నాడు. హీరోయిన్ డింపుల్ మాట్లాడుతూ గోదావరి నుండి పొట్టకూటికోసం గల్ఫ్ వెళ్లే లక్ష్మి పాత్రలో నటించానని, ఈ చిత్రంలో అద్భుతమైన ప్రేమ కథ కూడా ఉందని చెప్పింది.
నిర్మాతలు యెక్కలి రవీంద్ర బాబు, ఎం.ఎస్. రామ్ కుమార్, సహా నిర్మాతలు డాక్టర్ ఎల్,ఎన్. రావు, రాజా.జి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ బాపి రాజు మాట్లాడుతూ చిత్రం ఎక్కువ భాగాన్ని గల్ఫ్ లో చిత్రీకరించామని, పోస్ట్ ప్రొడక్షన్ అయిన వెంటనే, చిత్రాన్ని ఆగస్టు లో విడుదల చేస్తామని తెలిపారు. తోటపల్లి మధు, భద్రం గోపరాజు, అనిల్ కళ్యాణ్,సంతోష్ పవన్,శివ, ఎడిటర్ శామ్యూల్ కళ్యాణ్, మాటల రచయిత పులగం చిన్నారాయణ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
చివరగా దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ చిత్ర నటీ నటులు, సాంకేతిక నిపుణులు ఎంతగానో సహకరించారని, మాటల రచయిత పులగం చిన్నారాయణ
ఛాయాగ్రాహకుడు శ్రీరామ్, సంగీత దర్శకుడు ప్రవీణ్ ఇమ్మడి, ఎడిటర్ శామ్యూల్ కిరణ్,మరియు చిత్ర ప్రధాన తారాగణం,చిత్రాన్ని అద్భుతంగా మలిచారని తెలిపారు. తన ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన అతిధులు, పాత్రికేయులకు, గల్ఫ్ ప్రవాసీయులకి ధన్యవాదాలు తెలిపారు.
సరిహద్దులు దాటిన ప్రేమ కధ అనే శీర్షికతో వస్తున్న ఈచిత్రంలో సంతోష్ పవన్,అనిల్ కళ్యాణ్, పూజిత, సూర్య , శివ, పోసాని, నాగినీడు, జీవ, నల్ల వేణు, ప్రభాస్ శ్రీను, తనికెళ్ళ భరణి,తోటపల్లి మధు, శంకరాభరణం రాజ్యలక్ష్మి,సన, తీర్థ, డిగ్గీ, బిత్తిరి సత్తి,భద్రం, మహేష్, ఎఫ్ ఎం బాబాయ్ తదితరులు నటిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com