'గల్ఫ్' రిలీజ్ డేట్

  • IndiaGlitz, [Friday,October 06 2017]

శ్రావ్య ఫిలిమ్స్ పతాకంపై పి. సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో యక్కలి రవీంద్రబాబు, యమ్. రామ్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్న 'గల్ఫ్'. అక్టోబ‌ర్ 13న సినిమా విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో...

ద‌ర్శ‌కుడు పి.సునీల్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ - ''మా బ్యాన‌ర్‌లో వ‌స్తోన్న 16వ చిత్రం 'గ‌ల్ఫ్‌'. గ‌ల్ఫ్ వ‌ల‌స బాధితుల క‌థ‌తో తెర‌కెక్కిన సినిమా ఇది. దాదాపు నాలుగు వంద‌ల‌కు పైగా గ‌ల్ఫ్ బాధితుల‌తో మాట్లాడి క‌థ‌ను త‌యారు చేసుకున్నాఉ. అక్క‌డ మ‌న తెలుగువారు ఎలాంటి స‌మ‌స్య‌ల‌ను ఫేస్ చేస్తున్నారనేది ఈ సినిమా ఇతివృత్తం. హీరోయిన్ అర‌బ్ షేక్‌ల ఇంట్లో ప‌ని చేయ‌డానికి వెళుతుంది. అలాగే సిరిసిల్ల ప్రాంతం నుండి నిర్మాణ రంగంలో కూలీగా, చేనేత కార్మికుడు కొడుకు హీరో క‌న‌ప‌డ‌తారు. వారి మ‌ధ్య సాగే ప్రేమ క‌థ‌ను ఈ సినిమాలో చూపిస్తున్నాం. ముఖ్యంగా చేయ‌ని త‌ప్పుల‌కు జైలు శిక్ష‌ల‌ను అనుభ‌విస్తూ మ‌హిళ‌లు శారీర‌క హింస‌ల‌కు గురువుతున్నారు. వారి స‌మ‌స్య‌ను క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు చూపించాం. తొంబై శాతం సినిమాను అర‌బ్ దేశాల్లోనే చిత్రీక‌రించాం. ఇందులో ఓ అర‌బిక్ సాంగ్ కూడా ఉంటుంది'' అన్నారు.

హీరో చేత‌న్ మాట్లాడుతూ - ''హీరోగా నా రెండో చిత్ర‌మిది. రియ‌లిస్టిక్ క‌థాంశంతో తెర‌కెక్కిన చిత్రం. ఈ చిత్రంలో న‌టించ‌డం ఎంతో ఆనందంగా ఉంది'' అన్నారు.

హీరోయిన్ డింపుల్ మాట్లాడుతూ - ''న‌ట‌న‌కు మంచి స్కోప్ ఉన్న సినిమాలో హీరోయిన్‌గా చేయ‌డం ఆనందంగా ఉంది. అవ‌కాశం ఇచ్చిన ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు థాంక్స్‌'' అన్నారు.

నిర్మాత‌లు మాట్లాడుతూ - ''సినిమాను 300 పైగా థియేట‌ర్స్‌లో విడుద‌ల చేస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇత‌ర రాష్ట్రాల్లో కూడా స‌బ్ టైటిల్స్‌తో విడుద‌ల చేస్తున్నాం'' అన్నారు. చేతన్ మద్దినేని, డింపుల్, సంతోష్ పవన్, అనిల్ కళ్యాణ్, సూర్య ( పింగ్ పాంగ్), నల్ల వేణు, నాగినీడు, డిగ్గీ, పోసాని కృష్ణమురళి, జీవా, తనికెళ్ళ భరణి, తోటపల్లి మధు, భద్ర, బిత్తిరి సత్తి, ప్రభాస్ శ్రీను, శంఖరాభరణం రాజ్యలక్ష్మి, తీర్ద, సన, యఫ్ యం బాబాయ్, మహేష్ తదితరులు తారాగణం. కెమెరా : యస్. వి. శివరాం, ఎడిటింగ్ : కళ్యాణ్ సామ్యుల్, సంగీతం : ప్రవీణ్ ఇమ్మడి, మాటలు : పులగం చిన్నారాయణ, సహ నిర్మాతలు : డాక్టర్ ఎల్ . ఎస్. రావు, విజయ్, రాజా, ఎగ్జిక్యుటివ్ ప్రొడ్యూసర్ : బి. బాపిరాజు, నిర్మాతలు : యక్కలి రవీంద్రబాబు, యమ్ . రామ్ కమార్ (USA), స్క్రీన్ ప్లే, దర్శకత్వం : పి . సునీల్ కుమార్ రెడ్డి.