జూలై రెండో వారంలో గల్ఫ్
Send us your feedback to audioarticles@vaarta.com
శ్రావ్య ఫిలిమ్స్ పతాకంపై పి. సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో యక్కలి రవీంద్రబాబు, యమ్. రామ్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్న గల్ఫ్ చిత్రం విడుదలకు సిద్దమైంది.
ఎడారి దేశాలకు వలస వెళ్ళిన లక్షలాది మంది వారి జీవన స్థితి గతులను, గల్ఫ్ లో వారి భావోద్యోగాలను ఒక అందమైన ప్రేమ కథ నేపధ్యంలో చూసే ఈ ఎమోషనల్ ఎంటర్ టైనర్. జూలై రెండో వారంలో విడుదల చెయ్యనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
దుబాయ్, రసల్ కైమా, కువైట్ లాంటి గల్ఫ్ దేశాలలో విస్తృతంగా షూటింగ్ జరుగుతున్న ఈ చిత్రానికి సంగీతం ప్రవీణ్ ఇమ్మడి అందించారు. మస్కట్, UAB, విడుదల చేసిన ఆడియో టీజర్లకు విశేషంగా ఆదరణ లభించిందని చిత్రానికి రీ రికార్డింగ్ కూడా చక్కగా కుదిరిందని, సిరాశ్రీ, కాసర్ల శ్యామ్, మాస్టార్జీ లు అందించిన సాహిత్యం, అంజనా సౌమ్య, ధనుంజయ్, కే. యం. రాధాక్రిష్ణన్, దీపు, గీత మాధురి, హైమత్, మోహన భోగరాజు ల స్వరాలు, ఆడియోకి మరింత వన్నె తెచ్చాయని, జూలై ఒకటవ తారీకున ఆడియో విడుదల చేయనున్నామని సంగీత దర్శకుడు ప్రవీణ్ ఇమ్మడి తెలియచేసారు.
సరిహద్దులు దాటిన ప్రేమ కథ అనే క్యాప్సన్ తో వస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులని అలరిస్తుందని, ఇది తమ ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, క్రిమినల్ ప్రేమ కథల కన్నా పెద్ద కమర్షియల్ విజయాన్ని సొంత ఊరు, గంగపుత్రులకన్న ఎక్కువగా విమర్శకుల మన్ననలు పొందగలదని ఈ చిత్రాన్ని జూలై రెండో వారంలో విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత యక్కలి రవీంద్రబాబు తెలియజేసారు.
మాటల రచయుత పులగం చిన్నారాయణ మాట్లాడుతూ “ దాదాపుగా ప్రతి రోజు దిన పత్రికల్లో గల్ఫ్ కష్టాల గురించి, వెతలు గురించి ఎదో ఒక వార్త కనిపిస్తూనే ఉంటుంది. అందరికీ తెలిసినట్టే అనిపిస్తూ తెలియని అంశాలెన్నో గల్ఫ్ వెతల్లో కాన వస్తాయి. అసలు ఈ నేపధ్యంలో ఇంతవరకు తెలుగులో సినిమా రాకపోవడమే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. సునీల్ కుమార్ రెడ్డి ఆ లోటు తీర్చేసారు. ఆయనలోని జర్నలిస్ట్ ఈ సినిమా తీయడానికి ఉసిగోల్పినట్టు అనిపిస్తుంది. ఆయన ఇంతకు ముందు తీసిన సినిమాలన్నీ ఒకెత్తు, ఇదొక ఎత్తు, ఈ సినిమాకు డైలాగ్స్ రాసే అవకాశం రావడం ఒక టర్నింగ్ పాయింట్ గా భావిస్తున్నాను ” అని చెప్పారు.
చిత్ర దర్శకుడు పి. సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా ఈ ప్రాజెక్ట్ మీద తమ యూనిట్ పని చేసిందని, గల్ఫ్ దేశాలన్నీ పర్యటించి అక్కడ విజయాలు అందుకున్న వలస కూలీలను లేబర్ క్యాంపుల్లో ప్రత్యేక్షంగా కలిసి, దాదాపు 400 కి పైగా కేస్ స్టడీలు తీసుకుని తయారు చేసుకున్న కథ ఈ గల్ఫ్ అని, మనస్సుకు హత్తుకునే మాటలతో, అర్దవంతంగాను, వినోదాత్మంగాను వుండే విధంగా పులగం చిన్నారాయణ అందించిన సంభాషణలు చక్కటి బావోద్యోగాలు, మంచి నటన, కొత్త సన్ని వేశాలు. ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ అని, ఈ చిత్రం ప్రేక్షకులనందరినీ రంజింప చేస్తూనే ఆలోచింప చేస్తుందన్నారు.
చిత్ర ప్రచార భాద్యతలు నిర్వహిస్తున్న ఎగ్జిక్యుటివ్ ప్రొడ్యూసర్ బి. బాపిరాజు మాట్లాడుతూ ఈ చిత్రానికి ఎక్కువగా ప్రచారం గల్ఫ్ ప్రవాస అవగాహన యాత్ర పేరుతో ఉభయ తెలుగు రాష్ట్రాలలో తమ యూనిట్, సామాజిక కార్యకర్తలతో, పోలీసు డిపార్టమెంట్ తో, ఇతర ప్రభుత్వ సంస్థలతో Safe Migration కాంపెయిన్ చేస్తున్నామన్నారు.
ఇప్పటికే తొలి విడుత తెలంగాణలో సిరిసిల్ల, నిజామాబాద్, నిర్మల్ లో నిర్వహించమని త్వరలో అన్ని జిల్లాలలో కూడా ఈ పర్యటన జరుగుతుందని తెలిపారు.
చేతన్ మద్దినేని, డింపుల్, సంతోష్ పవన్, అనిల్ కళ్యాణ్, సూర్య ( పింగ్ పాంగ్), నల్ల వేణు, నాగినీడు, డిగ్గీ, పోసాని కృష్ణమురళి, జీవా, తనికెళ్ళ భరణి, తోటపల్లి మధు, భద్ర, బిత్తిలి సత్తి, ప్రభాస్ శ్రీను, శంఖరాభరణం రాజ్యలక్ష్మి, తీర్ద, సన, యఫ్ యం బాబాయ్, మహేష్ తదితరులు తారాగణం.
కెమెరా : యస్. వి. శివరాం, ఎడిటింగ్ : కళ్యాణ్ సామ్యుల్, సంగీతం : ప్రవీణ్ ఇమ్మడి, మాటలు : పులగం చిన్నారాయణ, సహ నిర్మాతలు : డాక్టర్ ఎల్ . ఎస్. రావు, విజయ్, రాజా, ఎగ్జిక్యుటివ్ ప్రొడ్యూసర్ : బి. బాపిరాజు, నిర్మాతలు : యక్కలి రవీంద్రబాబు, యమ్ . రామ్ కమార్ (USA), స్క్రీన్ ప్లే, దర్శకత్వం : పి . సునీల్ కుమార్ రెడ్డి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout