ఏప్రిల్ 6న గులేబకావళి

  • IndiaGlitz, [Tuesday,March 27 2018]

నృత్యదర్శకుడిగా, నటుడిగా, దర్శకుడిగా ఇండియన్ మైఖేల్‌జాక్సాన్‌గా పిలుచుకునే ప్రభుదేవాకు తెలుగునాట వున్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని గులేబకావళి చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నాం. యూనివర్శల్ పాయింట్‌తో తెరకెక్కిన ఈ చిత్రంలో కథ, కథనాలు చాలా ఆసక్తికరంగా వుంటాయి అంటున్నారు నిర్మాత మల్కాపురం శివకుమార్. పభుదేవా, హన్సిక జంటగా నటించిన తమిళ చిత్రం గులేబకావళి. కల్యాణ్ దర్శకత్వం వహించారు. సీనియర్ నటి రేవతి ఓ శక్తివంతమైన పాత్రలో నటించారు.

తమిళనాట సంక్రాంతికి విడుదలైన ఈచిత్రం అక్కడ  ఘన విజయాన్ని నమోదు చేసుకుంది. కాగా ఇప్పుడు ఈ చిత్రాన్ని అదే పేరుతో సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండియా ప్రవైట్ లిమిటెడ్ పతాకంపై మల్కాపురం శివకుమార్ తెలుగులోకి అనువదిస్తున్నారు. ఏప్రిల్ 6న ఈ చిత్రం  ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా నిర్మాత చిత్ర విశేషాలు తెలియజేస్తూ   తమిళంలో ఘనవిజయం సాధించిన ఈ చిత్రం తెలుగు నేటివిటికి దగ్గరగా వుంటుంది.

యూనివర్శల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన  ఈ చిత్రం తప్పకుండా తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందనే విశ్వాసంతో తెలుగులోకి అనువదిస్తున్నాను. ఇటీవల విడుదలైన పాటలకు, ప్రభుదేవా నృత్యాలకు మంచి స్పందన వస్తోంది. చిత్రం కూడా అందరి అలరిస్తుందనే నమ్మకం వుంది.  గులేబకావళి అనే గ్రామంలో నిక్షిప్తమైన నిధి కోసం జరిగే అన్వేషణ నేపథ్యంలో ఈ కథ కొనసాగుతుంది.

పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్‌గా సాగే ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే హైలైట్‌గా వుంటుంది అని తెలిపారు. ప్రభుదేవా, హాన్సిక, రేవతి, మన్సూర్ అలీఖాన్, మధు, ఆనంద్‌రాజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి స్టంట్స్: పీటర్ హెయిన్స్, సంగీతం: వివేక్ మెర్విన్, కెమెరా: ఆర్‌ఎస్ ఆనంద్‌కుమార్, ఆర్ట్: కదీర్, పాటలు: సామ్రాట్, దర్వకత్వం: కల్యాణ్, నిర్మాత: మల్కాపురం శివకుమార్. 

More News

అభిమానులు, అభిమానాన్ని ర‌క్తం దానం చేసి  చూపించారు: నిర్మాత అల్లు అర‌వింద్

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ పుట్టిన రోజు వేడుక‌లు నేడు (మంగ‌ళ‌వారం)  హైద‌రాబాద్ జూబ్లీ హిల్స్ లోని  చిరంజీవి బ్ల‌డ్ బ్యాంక్ లో

బెల్లంకొండ శ్రీనివాస్ సరసన కాజల్ అగర్వాల్ కన్ఫర్మ్

ఇప్పటివరకూ స్టార్ డైరెక్టర్లతో కలిసి సినిమాలు చేస్తూ కథానాయకుడిగా తన స్టార్ డమ్ ను పెంచుకొన్న బెల్లంకొండ శ్రీనివాస్

గుమ్మడికాయ కొట్టిన ఆటగాళ్లు !!

సెన్సిబుల్ యాక్టర్ నారా రోహిత్, స్టైలిష్ విలన్ జగపతిబాబు కలిసి నటించిన చిత్రం "ఆటగాళ్లు".

మ‌ల్టీస్టార‌ర్‌లో రామ్ చ‌ర‌ణ్ పాత్ర ఎంటంటే...

ప్ర‌స్తుతం రంగ‌స్థ‌లం రిలీజ్ టెన్ష‌న్‌తో ఉన్న బ‌ర్త్ డే బాయ్ రామ్‌చ‌ర‌ణ్ తదుప‌రి బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తున్నాడు.

కేసీఆర్ బ‌యోపిక్‌కి రంగం సిద్ధం...

తెలంగాణ రాష్ట్ర సాధ‌కుడుగా.. తెలంగాణ ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర్ రావు పేరు నిలిచిపోయింది.