పవర్‌స్టార్ దగ్గర పని చేశాడు... మాస్ మహారాజా దగ్గరకొచ్చాడు!
Send us your feedback to audioarticles@vaarta.com
మాస్ మహారాజా రవితేజ ప్రజెంట్ ‘ఖిలాడి’ సినిమా చేస్తున్నాడు. దీని తర్వాత కొత్త దర్శకుడికి ఛాన్స్ ఇవ్వబోతున్నాడని ఫిల్మ్‌నగర్ టాక్. కొత్త దర్శకులను ఎంకరేజ్ చేసే హీరోల్లో రవితేజ ఒకరు. ‘షాక్’తో హరీష్ శంకర్‌ను, ‘డాన్ శీను’తో గోపీచంద్ మలినేనిని, ‘పవర్’తో బాబీ అలియాస్ కేయస్ రవీంద్రను దర్శకులకు ఇంట్రడ్యూస్ చేశాడు మాస్ మహారాజా. ఇప్పుడు గులాబీ శ్రీనును ఇంట్రడ్యూస్ చేయబోతున్నాడని టాక్. అతడు ఇంతకు ముందు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ దగ్గర పని చేశాడు. ‘సర్దార్ గబ్బర్ సింగ్’, ‘కాటమరాయుడు’ సినిమాలకు గులాబీ శ్రీను డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో చేశాడు. ఇప్పుడు మాస్ మహారాజా దగ్గరకొచ్చి స్టోరీ చెప్పాడు. అన్నీ కుదిరితే ‘ఖిలాడి’ తర్వాత గులాబీ శ్రీనుతో రవితేజ సినిమా చేసే ఛాన్స్ ఉంది. లేదంటే డైరెక్టర్ త్రినాథరావు నక్కినతో సినిమా చేసి ఆ తర్వాత గులాబీ శ్రీనుతో చేయవచ్చు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout