మహేష్ కి షాక్ ఇచ్చిన డిప్యూటీ సి.ఎం..!
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ మహేష్ బాబుకి డిప్యూటీ సి.ఎం షాక్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సి.ఎమ్మో, తెలంగాణ సి.ఎమ్మో కాదండీ..గుజరాత్ డిప్యూటి సి.ఎం నితిన్ భాయ్ పటేల్. ఇంతకీ విషయం ఏమిటంటే...మహేష్, మురుగుదాస్ కాంబినేషన్ లో రూపొందుతున్న భారీ చిత్రం గుజరాత్ లోని అహ్మదాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది. షూటింగ్ జరుగుతున్న స్పాట్ కి ఊహించని విధంగా గుజరాత్ డిప్యూటీ సి.ఎం నితిన్ భాయ్ పటేల్ వచ్చారట.
ఆయన ఒక్కరే కాకుండా ఫ్యామిలీ మొత్తం వచ్చిందట. వాళ్లు రావడం చూసి మహేష్ బాబు మాత్రమే కాకుండా యూనిట్ మొత్తం షాక్ అయ్యారట. కారణం ఏమింటే...ఆయనతో పాటు ఫ్యామిలీ మొత్తం మహేష్ ఫ్యాన్స్ అట. అందుచేత మహేష్ ని కలిసేందుకు అక్కడకి వచ్చారట. నితిన్ భాయ్ ఫ్యామిలీ మెంబర్స్... మహేష్ తో మాట్లాడడమే కాకుండా అందరూ కలిసి ఫోటోలు తీసుకున్నారు. మహేష్ కి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా గుజరాత్ లో ఫ్యాన్స్ ఉండడం...అది కూడా డిప్యూటీ సి.ఎం మహేష్ ఫ్యాన్ కావడం విశేషం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com