తిరుమల వెంకన్నను దర్శించుకోవాలంటే మార్గదర్శకాలు ఇవే..
Send us your feedback to audioarticles@vaarta.com
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన తిరుమల వెంకన్న సన్నిధిలో లాక్ డౌన్‌లోనూ కైంకర్యాలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే లాక్ డౌన్ 5.0లో భాగంగా గురువారం రాత్రి కేంద్ర ఆరోగ్య శాఖ దేవాలయాలు, రెస్టారెంట్‌లు, మాల్స్, హోటల్స్ తెరుచుకోవడానికి కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. దీంతో యావత్ దేశ వ్యాప్తంగా ఉన్న దేవాలయాలన్నీ తెరుచుకోనున్నాయి. ఈ క్రమంలో టీటీడీ కూడా శ్రీవారిని దర్శించుకునేందుకు నియమ నిబంధనలను వెల్లడించింది. శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడిన టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వివరాలు వెల్లడించారు.
వీరికి మాత్రమే అనుమతి..
‘ప్రతీరోజు ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు భక్తులకు శ్రీవారి దర్శనం ఉంటుంది. ప్రతీ రోజు 7 వేల మందికి మాత్రమే దర్శనం. 60 ఏళ్లు పైబడిన వృద్ధులు, పదేళ్లలోపు పిల్లలకు ఎంట్రీ ఉండదు. కంటైన్మెంట్, రెడ్ జోన్ల పరిధిలో ఉన్న భక్తులకు అనుమతి లేదు. ఈ నెల 11 నుంచి భక్తులకు శ్రీవారి దర్శనం ఉంటుంది. 8, 9 తేదీల్లో టీటీడీ ఉద్యోగులతో ట్రయల్ రన్ నిర్వహిస్తాం. 10న దర్శనానికి స్థానికులకు అనుమతి ఉంటుంది. క్యూలైన్ కదలికను గుర్తించేందుకు గంటకు ఎంత మందిని దర్శనానికి పంపగలుగుతామనే అంశంపై పరిశీలించాం. పరిమిత సంఖ్యలో మాత్రమే దర్శనాలు ఉంటాయి. ప్రభుత్వం నిబంధనలను భక్తులు తప్పకుండా పాటించాలి. శానిటైజర్లు తప్పనిసరిగా వాడాలి. టీటీడీ చర్యలకు భక్తులు సహకరించాలి. తిరుమలలో ప్రధానంగా నాలుగు సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించాం. కల్యాణకట్టలో తలనీలాలు తాత్కాలికంగా రద్దు చేస్తున్నాం. అన్న ప్రసాద కేంద్రం వద్ద చేతులు శుభ్రపరుచుకునే ప్రాంతంలో భక్తులు జాగ్రత్త వహించాలి. కొన్ని రోజుల పాటు తీర్థం చఠారి రద్దు చేస్తున్నాం. ఉదయం 6 నుంచి సాయంత్రం 3 గంటల వరకు మాత్రమే అలిపిరి నడక మార్గంలో భక్తులను అనుమతిస్తాం. శ్రీవారి మెట్ల మార్గం తాత్కాలికంగా భక్తుల అనుమతి నిషేధం. ఉద్యోగుల లోపం వల్లే భూముల విషయంలో మీడియాలో దుష్ప్రచారం జరిగింది.. వారిపై చర్యలు తీసుకున్నాం’ అని వైవీ సుబ్బారెడ్డి మీడియాకు వెల్లడించారు.
మార్గదర్శకాలు ఇవీ..
ఈ సందర్భంగా టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడుతూ.. శ్రీవారి దర్శనాన్ని నిలిపివేసినప్పటికీ శ్రీవారి ఆలయంతో పాటు అనుభంద ఆలయాలలో పూజా కైంకర్యాలు,ఉత్సవాలను ఆగమోక్తంగా ఏకాంతంగానే నిర్వహించామన్నారు. ఈ సందర్భంగా మార్గదర్శకాలతో పాటు పలు విషయాలను ఆయన చదివి వినిపించారు.
- ప్రస్తుతం గంటకి 500 మంది భక్తులకు మాత్రమే శ్రీవారి దర్శనభాగ్యం
- వాలంటీర్లు ద్వారా గ్రామీణ ప్రాంతాలలో ఉన్న భక్తులు ఆన్‌లైన్‌లో దర్శన టిక్కేట్లు పోందేలా ఏర్పాట్లు
- భక్తులకు ఎవరికైనా కరోనా పాజిటివ్ వస్తే క్వారంటైన్‌కి తరలిస్తాం
- దర్శన టోకెన్ బుక్ చేసుకునే సమయంలోనే ఆన్ లైన్‌లో గదులను కూడా పొందవచ్చు
- ఆర్టీసి బస్సులు భక్తుల లగేజిని కూడా శానిటేషన్ నిర్వహించేలా ఏర్పాట్లు
- అలిపిరి నడకమార్గంలో హకర్స్‌ని అనుమతించం
- వసతి గదులను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే సౌకర్యం కల్పిస్తూన్నాం
- వసతి గదిలో ఇద్దరిని మాత్రమే అనుమతిస్తాం
- గదులో కేటాయింపు సమయంలో సరి బేసి సంఖ్య విధానాంలో కేటాయిస్తాం
- వసతి గదిని భక్తులకు ఒక్కరోజుకు మాత్రమే కేటాయిస్తాం
- భక్తులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలి
- కళ్యాణకట్టలో ఉద్యోగులకు పిపిఇ కిట్ తప్పనిసరిగా ధరించి విధులకు హాజరుకావాలి
- ఆలయంలోని ఉప ఆలయాలలో భక్తులను దర్శనానికి అనుమతించం
- శ్రీవారి ఆలయంలో భక్తులకు అన్నప్రసాద పంపిణి అనుమతి కోసం కేంద్ర ప్రభుత్వాని కోరుతాం
- అన్నప్రసాద సముదాయంలో ప్రతి 2 గంటలకు ఒక్కసారి శానిటేషన్ నిర్వహించేలా ఏర్పాట్లు
- పాదరక్షలు భక్తులు స్వయంగా భధ్ర పర్చుకునేలా ఏర్పాట్లు
- దుకాణదారులు కచ్చితంగా టీటీడీ నియమ నిబంధనలను పాటించాలి
- ప్రభుత్వ ఆదేశాలు మేరకు దుకాణాలు తెర్చుకునేలా అనుమతులు
- ప్రభుత్వ ఆదేశాలు అమలవుతున్న తీరుని పర్యవేక్షణకు సినియర్ అధికారులుతో కమిటిని ఏర్పాటు
- టీటీడి అనుభంద ఆలయాలలో కూడా పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకుంటాం
- 8వ తేదీ నుంచి జూన్ నెల టైం స్లాట్ కోటాను ఆన్ లైన్‌లో భక్తులు పొందవచ్చు అని ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మీడియాకు వెల్లడించారు.
టీటీడీ అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి మాట్లాడుతూ.. ఇతర రాష్ట్రాల నుంచి టిక్కెట్లు పొందినా భక్తులు ఆ రాష్ట్రంలో అనుమతి వాళ్లే తీసుకోవాలన్నారు. ఒక్కరోజు ముందుగానే టోకెన్లు పొందాల్సి ఉంటుందన్నారు. ఎస్ఎస్డీ టైమ్స్ స్లాట్ కౌంటర్లో టికెట్స్ పొందాల్సి ఉంటుందన్నారు. 10వ తేదీ నుంచి టిక్కెట్లు జారీ చేస్తామన్నారు. పరిస్థితి బట్టి టికెట్ల పెంపుపై నిర్ణయం తీసుకుంటామని.. ప్రోటోకాల్ విఐపి సెల్ఫ్ మాత్రమే విఐపి బ్రేక్ దర్శనాలు జారీ చేస్తామన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com