డబుల్ మాస్క్ వాడుతున్నవారు.. ఈ విషయం తెలుసుకోవల్సిందే..

  • IndiaGlitz, [Tuesday,May 11 2021]

కరోనా మహమ్మారి దేశంలో విజృంభిస్తోంది. ఈ తరుణంలో మాస్క్ ధరించడం, శానిటైజర్ వాడటం, సోషల్ డిస్టెన్స్ పాటించడమనేది మానిడేటరీ అయిపోయింది. ముఖ్యంగా మాస్క్‌పై అయితే ప్రతి ఒక్కరిలోనూ అవగాహన పెరిగింది. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్‌ను ధరిస్తున్నారు. కొందరు డబుల్ మాస్కులను సైతం వాడుతున్నారు. అయితే వాటిని వాడే ముందు అసలు ఏ మాస్కును ధరించాలి? డబుల్ మాస్కును వాడితే ఎలా వాడాలనేది తెలుసుకోవడం తప్పనిసరి.

Also Read: ఇది మానవత్వమేనా?.. ధిక్కరణ నోటీసులిస్తాం: తెలంగాణ హైకోర్టు వార్నింగ్

వైరస్ నుంచి సురక్షితంగా బయటపడాలంటే.. మాస్కు తప్పనిసరి అని శాస్త్రవేత్తలు ఎప్పటి నుంచో చెబుతూ వస్తున్నారు. కేంద్రం తాజాగా డబుల్ మాస్క్‌ వాడకంపై కేంద్ర ప్రభుత్వం కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. నిపుణుల ప్రకారం.. డబుల్‌ మాస్క్‌ వేసుకోవడంతో కొంతమేరకు వైరస్‌ వ్యాప్తి జరిగే ప్రభావాన్ని తగ్గించవచ్చునని తేలింది. కాగా తాజాగా డబుల్‌ ఒకే రకమైన రెండు మాస్క్‌లను డబుల్‌ మాస్క్‌గా వాడొద్దని కేంద్రం స్పష్టం చేసింది. అంటే చాలా మంది క్లాత్ మాస్కులను రెండింటినీ డబుల్ మాస్కుగా వాడుతున్నారు.

అలా వాడొద్దని.. డబుల్‌ మాస్క్‌ను ధరించేటప్పుడు వాటిలో కచ్చితంగా ఒక సర్జికల్‌ మాస్క్‌.. రెండోది క్లాత్‌ మాస్క్‌ అయి ఉండాలని కేంద్రం సూచించింది. అంతేకాకుండా ఒకే మాస్క్‌ను వరుసగా రెండ్రొజులు పాటు వాడొద్దని కేంద్రం తెలిపింది. సాధారణ క్లాత్‌ మాస్క్‌ 42 నుంచి 46 శాతం వరకు రక్షణ కల్పిస్తుందని అధ్యయనకర్తలు వెల్లడించారు. సర్జికల్‌ మాస్కు అయితే 56.4 శాతం రక్షణ ఇస్తుందన్నారు. సర్జికల్‌ మాస్కుపై క్లాత్‌మాస్కు ధరిస్తే కరోనా నుంచి రక్షణ 85.4 శాతం వరకూ ఫలితం ఉంటుందన్నారు.

More News

ఇది మానవత్వమేనా?.. ధిక్కరణ నోటీసులిస్తాం: తెలంగాణ హైకోర్టు వార్నింగ్

తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో అత్యవసర విచారణ జరిగింది. రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా పరిస్థితి దారుణంగా తయారవుతోంది.

కొవిడ్ చికిత్సకు ఇవర్‌మెక్టిన్ వాడొద్దు: డబ్ల్యూహెచ్‌వో

కొవిడ్ చికిత్సకు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) కీలక హెచ్చరికలు జారీ చేసింది.

గంగానదిలో కరోనా మృతదేహాల గుట్టలు..

కరోనా మహమ్మారి ఏ స్థాయిలో విస్తరిస్తోంది.. దీని కారణంగా మరణాలు ఏ స్థాయిలో ఉంటున్నాయనే దానికి ఈ వార్తే ఉదాహరణ.

తిరుపతి రుయాలో ఘోరం.. 11 మంది ప్రాణాలు బలిగొన్న 15 నిమిషాలు!

తిరుపతిలోని రుయా ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరత కారణంగా మరణ మృదంగం మోగింది.

థర్డ్‌వేవ్‌ను దృష్టిలో పెట్టుకుని సోనూసూద్ సంచలన నిర్ణయం

కరోనా సెకండ్ వేవ్ భారతదేశాన్ని ఎంత అల్లకల్లోలం చేస్తోందో తెలియనిది కాదు.