నిర్మాతలదే బాధ్యత.. తేల్చిచెప్పేసిన కేసీఆర్ సర్కార్
- IndiaGlitz, [Tuesday,June 09 2020]
తెలంగాణలో సినిమా, టీవీ సీరియల్స్ షూటింగ్‌లకు సీఎం కేసీఆర్ అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి ప్రభుత్వం జీవో విడుదల చేసింది. అలాగే మార్గదర్శకాలు కూడా రిలీజ్ చేసింది. లాక్ డౌన్ నిబంధనలను అనుసరిస్తూ షూటింగ్‌లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కాగా మొత్తం ఆర్టిస్టుల బాధ్యత నిర్మాతలదేనని మార్గదర్శకాల్లో కేసీఆర్ సర్కార్ స్పష్టం చేసింది.
మార్గదర్శకాలు ఇవే..
- సగం పూర్తయిన సినిమాలు, టీవీ సీరియళ్ల షూటింగ్ లకు మాత్రమే అనుమతి
- ప్రతి ఒక్కరి నుంచి మెడికల్ డిక్లరేషన్ తప్పనిసరి
- షూటింగ్ లో మాస్క్, భౌతికదూరం తప్పనిసరి
- షూటింగ్ ఏరియాలో పాన్, సిగరెట్లు నిషేధం
- షూటింగ్ ఏరియాలో తప్పనిసరిగా డాక్టర్ ఉండాల్సిందే
- ప్రతి రోజూ ఉదయాన్నే భౌతికదూరం గురించి చిత్ర యూనిట్‌కు వివరించాలి
- ఆర్టిస్టుల ఆరోగ్య భద్రత నిర్మాతలదే
- షూటింగ్‌లో 40మందికి మాత్రమే అనుమతి
- షూటింగ్ ప్రాంతాల్లో తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ మాస్క్‌లు ధరించాలి
- కార్లను శానిటైజ్ చేసిన తర్వాతే ఆర్టిస్టుల దగ్గరికి పంపాలి
- ఎంట్రీ, ఎగ్జిట్ గేట్ ప్రాంతాల్లో తప్పనిసరిగా శానిటైజర్, హ్యాండె వాష్ అందుబాటులో ఉంచాలి
- కంటైన్మెంట్ జోన్లలో షూటింగ్ లు చేయకూడదు
- వీలైనంత వరకు బహిరంగ ప్రదేశాల్లో షూటింగ్‌లు జరపకూడదు
- మేకప్ వేసుకున్నా ఆర్టిస్టులు ఫేస్ షీల్డ్‌ను ఉపయోగించాలి
- ఇండోర్ షూటింగ్‌లకే ప్రాధాన్యత ఇవ్వాలి
- మేకప్ ఆర్టిస్టులు, హెయిర్ డ్రస్సర్లు పీపీఈ కిట్లు ధరించాలని మార్గదర్శకాల్లో స్పష్టంగా తెలంగాణ సర్కార్ వివరించింది.