విమానం ఎక్కాలంటే ఈ కీలక మార్గదర్శకాలు పాటించాల్సిందే..!
Send us your feedback to audioarticles@vaarta.com
మే-25 నుంచి భారతదేశంలో విమానయాన సేవలు తిరిగి ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) దేశీయ ప్రయాణాలకు కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మార్గదర్శకాలను పాటించాల్సిందేనని లేకుంటే ప్రయాణం చేయడానికి అనుమతించమని తేల్చిచెప్పేసింది. గురువారం రోజున ఇందుకు సంబంధించిన ప్రామాణిక నిబంధనలను జారీ చేసింది. విమానయాన ప్రయాణికులకు, ఎయిర్ పోర్ట్ సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వాలు తగిన రవాణా ఏర్పాట్లు చేయాలని సూచించింది.
కీలక మార్గదర్శకాలివీ...
ప్రయాణికులు రెండు గంటల ముందే విమానాశ్రయానికి చేరుకోవాలి.. అంతకుముందు వచ్చినా అనుమతించరు.
మాస్క్, గ్లౌజులు తప్పనిసరిగా ధరించాలి.
ప్రతి ఒక్కరు ఆరోగ్య సేతు యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలి.
ఎయిర్ పోర్ట్ సిబ్బంది ప్రవేశ మార్గాల ద్వారా తనిఖీ చేస్తారు.
14 ఏళ్లలోపు పిల్లలకు ఆరోగ్య సేతు యాప్ తప్పనిసరి కాదని స్పష్టం.
విమానాశ్రయం టెర్మినల్ భవనంలోకి ప్రవేశించే ముందు ప్రయాణీకులు తప్పనిసరిగా థర్మల్ స్క్రీనింగ్ జోన్ గుండా నడవాలి. ఇందుకు విమానాశ్రయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేయలి.
టెర్మినల్ భవనంలోకి ప్రవేశించే ముందు విమానాశ్రయ నిర్వాహకులు ప్రయాణీకుల లగేజీ శానిటైజేషన్ చేసేందుకు తగిన ఏర్పాట్లు చేయాలి.
ఎయిర్ పోర్టులో ప్రయాణికులు సామాజిక దూరం పాటించే విధంగా మార్కింగ్ చేయాలి.
ఎయిర్ పోర్టుల్లో ఎక్కడ కూడా ప్రయాణికులు గుమికూడకుండా చూడాలి.
ఎయిర్ పోర్ట్ లలో విరివిగా శానీటైజర్స్ అందుబాటులో ఉంచాలి.
పూర్తి టెర్మినల్ ను ఎప్పటికప్పుడు శానిటైజేషన్ చేయాలి.
ఫుడ్ & బేవరేజెస్ దుకాణాలు కోవిడ్-19 జాగ్రత్తలను పాటిస్తూ తెరిచి ఉంచేందుకు అనుమతిస్తామని ఏఏఐ స్పష్టం చేసింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments