టికెట్ ధరపై తగ్గిన జి.ఎస్.టి
- IndiaGlitz, [Sunday,December 23 2018]
కేంద్ర ప్రభుత్వం 18 శాతం జి.ఎస్.టి పన్ను విధించినప్పుడు సినిమా రంగ పరిశ్రమ బెంబేలెత్తింది. ఎందుకంటే వంద రూపాయల కంటే ఎక్కువగా ఉన్న టికెట్స్‌పై జి.ఎస్.టి 28 శాతం వసూలు చేశారు. అసలే ప్రేక్షకులు థియేటర్స్‌కు రావడం తగ్గించేసిన నేపథ్యంలో జి.ఎస్.టి దెబ్బ సినీ పరిశ్రమకు తలనొప్పిగా మారింది. అయితే ఇప్పుడు సినిమా టికెట్స్‌పై జి.ఎస్.టిని తగ్గిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
100 రూపాయల పైగా ఉన్న టికెట్‌పై జి.ఎస్.టి 28 శాతం నుండి 18 శాతానికి తగ్గింది. వందరూపాయల టికెట్‌పై ఉన్న జి.ఎస్.టి 18 శాతం నుండి 12 శాతానికి తగ్గింది. ప్రభుత్వ నిర్ణయం పట్ల సినీ వర్గాల సంతోషాన్ని వ్యక్తం చేశాయి.