'గృహం' మళ్లీ వాయిదా పడిందా?
Send us your feedback to audioarticles@vaarta.com
హాలీవుడ్ స్థాయిలో మన దక్షిణాదిన హారర్ చిత్రాలు రూపొందడం అరుదుగా చూస్తుంటాం. అలాంటి అరుదైన సినిమాల్లో ఒకటిగా నిలిచింది అవళ్. నవంబర్ 3న విడుదలైన ఈ తమిళ చిత్రానికి కోలీవుడ్‌లో హిట్ టాక్ రావడమే కాకుండా.. విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి. నువ్వొస్తానంటే నేనొద్దాంటానా, బొమ్మరిల్లు చిత్రాలతో తెలుగువారికి దగ్గరైన సిద్ధార్థ్ ఇందులో కథానాయకుడిగా నటించగా.. గాయని, నటి ఆండ్రియా అతనికి జోడీగా నటించింది.
మిలింద్ రావ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులో గృహం పేరుతో నవంబర్ 3న విడుదల చేయాలనుకున్నారు. అయితే.. అదే రోజు పిఎస్‌వి గరుడవేగ 126.18 ఎం, ఏంజెల్, నెక్ట్స్ నువ్వే విడుదల కావడంతో.. నవంబర్ 10కి వాయిదా వేశారు. అయితే.. ఈ సారి కూడా అదే సమస్య రావడంతో.. నవంబర్ 17కి ఈ సినిమాని పోస్ట్ పోన్ చేశారని టాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.
9న విజయ్ తమిళ అనువాద చిత్రం అదిరింది విడుదల కానుండగా.. 10న మంచు మనోజ్ ఒక్కడు మిగిలాడుతో పాటు విశాల్ తమిళ అనువాద చిత్రం డిటెక్టివ్ కూడా రిలీజ్ కాబోతోంది. మొత్తమ్మీద.. థియేటర్ల కొరత కారణంగా గృహం విడుదల విషయంలో ఇబ్బందులు పడుతోందన్నమాట. ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో.. ఈ సినిమా ఎప్పుడు వచ్చినా మన ప్రేక్షకుల నుంచి ఆదరణ ఉంటుందన్న నమ్మకంతో ఉంది యూనిట్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments