'గృహం' మ‌ళ్లీ వాయిదా ప‌డిందా?

  • IndiaGlitz, [Wednesday,November 08 2017]

హాలీవుడ్ స్థాయిలో మ‌న ద‌క్షిణాదిన‌ హార‌ర్ చిత్రాలు రూపొంద‌డం అరుదుగా చూస్తుంటాం. అలాంటి అరుదైన సినిమాల్లో ఒక‌టిగా నిలిచింది అవ‌ళ్‌. నవంబ‌ర్ 3న విడుద‌లైన ఈ త‌మిళ చిత్రానికి కోలీవుడ్‌లో హిట్ టాక్ రావ‌డ‌మే కాకుండా.. విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు కూడా ద‌క్కాయి. నువ్వొస్తానంటే నేనొద్దాంటానా, బొమ్మ‌రిల్లు చిత్రాల‌తో తెలుగువారికి ద‌గ్గ‌రైన సిద్ధార్థ్ ఇందులో క‌థానాయ‌కుడిగా న‌టించ‌గా.. గాయ‌ని, న‌టి ఆండ్రియా అత‌నికి జోడీగా న‌టించింది.

మిలింద్ రావ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులో గృహం పేరుతో నవంబ‌ర్ 3న విడుద‌ల చేయాల‌నుకున్నారు. అయితే.. అదే రోజు పిఎస్‌వి గ‌రుడ‌వేగ 126.18 ఎం, ఏంజెల్‌, నెక్ట్స్ నువ్వే విడుద‌ల కావ‌డంతో.. న‌వంబ‌ర్ 10కి వాయిదా వేశారు. అయితే.. ఈ సారి కూడా అదే స‌మ‌స్య రావ‌డంతో.. నవంబ‌ర్ 17కి ఈ సినిమాని పోస్ట్ పోన్ చేశార‌ని టాలీవుడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.

9న విజ‌య్ త‌మిళ అనువాద చిత్రం అదిరింది విడుద‌ల కానుండ‌గా.. 10న మంచు మ‌నోజ్ ఒక్క‌డు మిగిలాడుతో పాటు విశాల్ త‌మిళ అనువాద చిత్రం డిటెక్టివ్ కూడా రిలీజ్ కాబోతోంది. మొత్త‌మ్మీద‌.. థియేట‌ర్ల కొర‌త కార‌ణంగా గృహం విడుద‌ల విష‌యంలో ఇబ్బందులు ప‌డుతోందన్న‌మాట‌. ట్రైల‌ర్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చిన నేప‌థ్యంలో.. ఈ సినిమా ఎప్పుడు వ‌చ్చినా మ‌న ప్రేక్ష‌కుల నుంచి ఆద‌ర‌ణ ఉంటుంద‌న్న న‌మ్మ‌కంతో ఉంది యూనిట్‌.

More News

వెంకీకి నో చెప్పిన కాజ‌ల్‌?

గురు త‌రువాత దాదాపు తొమ్మిది నెల‌ల గ్యాప్‌తో విక్ట‌రీ వెంక‌టేష్ సినిమా ప‌ట్టాలెక్క‌నుంది. నేనే రాజు నేనే మంత్రితో ప‌దిహేనేళ్ల త‌రువాత విజ‌యాన్ని అందుకున్న తేజ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు.

వెంకీతో వ‌రుణ్ తేజ్‌...

సీనియ‌ర్ హీరో విక్ట‌రీ వెంక‌టేష్‌తో ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి ఓ మ‌ల్టీస్టార‌ర్ సినిమాను తెర‌కెక్కిస్తాడ‌ని వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే.

చైతు స‌ర్‌ప్రైజ్....

తాను ప్ర‌పంచంలోనే అత్యుత్త‌మ‌మైన వ్య‌క్తిని పెళ్లి చేసుకున్నాన‌ని ఆనందం వ్య‌క్తం చేస్తుంది హీరోయిన్ స‌మంత‌. హీరో నాగ చైత‌న్య‌, స‌మంత‌ల‌కు గ‌త నెల పెళ్లైన సంగ‌తి తెలిసిందే.

నారా రోహిత్‌.. న‌వంబ‌ర్ 10 స్పెష‌ల్‌

బాణం, సోలో, ప్ర‌తినిధి, రౌడీ ఫెలో, జో అచ్యుతానంద చిత్రాల‌తో ఆక‌ట్టుకున్న క‌థానాయ‌కుడు నారా రోహిత్‌. డిఫ‌రెంట్ పాత్ర‌ల‌కు చిరునామాలా ఉండే రోహిత్‌.. ప్ర‌స్తుతం బాల‌కృష్ణుడు చిత్రంలో క‌థానాయకుడిగా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.

'లీడర్'కి సీక్వెల్ ?

`బాహుబలి`, `బాహుబలి 2` చిత్రాలతో జాతీయ స్థాయిలో మంచి గుర్తింపుని సంపాదించుకున్నాడు రానా. ఇక ఈ ఏడాదిలో ఆయన కథానాయకుడిగా వచ్చిన `ఘాజీ`, `నేనే రాజు నేనే మంత్రి` చిత్రాలు కూడా మంచి విజయం సాధించాయి.