అనురాగ్‌కశ్యప్‌కి పెరుగుతున్న మద్దతు
Send us your feedback to audioarticles@vaarta.com
లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న దర్శకుడు అనురాగ్ కశ్యప్‌కు ఇండస్ట్రీ సెలబ్రిటీల నుండి మద్దతు దొరుకుతుంది. తాప్సీ ఇప్పటికే తన మద్దతును తెలియజేసింది. ఇప్పుడు ఈ విషయంలో వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ, అనురాగ్ కశ్యప్ మాజీ భార్య, నటి కల్కి కొచ్లిన్ తమ మద్దతుని అనురాగ్‌కి తెలియజేశారు.
పరీక్షా సమయం..
కల్కొకొచ్లిన్ ఇన్‌స్టాలో అనురాగ్‌కి మద్దతుని తెలియజేస్తూ ఓ లెటర్ పోస్ట్ చేశారు. "డియర్ అనురాగ్ ఇది పరీక్షా సమయం. సోషల్ మీడియాలో వినిపిస్తోన్న పుకార్లను నమ్మకండి. నిజానిజాలు తెలుసుకోకుండా విమర్శలు చేస్తుంటారు. అవసరమైన సమయంలో ప్రేమను పంచే మనుషులే కాదు.. దయను చూపించే మనుషులు కూడా ఉంటారు. ధైర్యంగా ఉండండి. మీరు స్క్రిప్ట్‌లో మహిళల స్వేచ్చను కోరుతారు. మహిళల సమగ్రతకు ఎంతగానో సపోర్ట్ చేస్తారు. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా మీరెంతో సపోర్ట్ చేస్తారనడానికి నేనే సాక్షిని. మన విడాలకు తర్వాత కూడా నా చిత్తశుద్ధి కోసం నిలబడ్డారు. నేను పనిచేసేచోట అసౌకర్యానికి లోనైనప్పుడు మద్దతుగా నిలిచారు. మీ గౌరవంపై నిలబడండి.. ధైర్యంగా ఉండండి" అన్నారు.
తను గురించి నేనలా వినలేదు కూడా...
వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ కూడా ట్విట్టర్ వేదికగా అనురాగ్‌కు మద్దతుగా నిలిచారు. "అనురాగ్ సున్నితమైన, ఎమోషనల్ పర్సన్. నాకు తను 20 ఏళ్లుగా తెలుసు. ఇన్నేళ్లలో తనెవరినీ బాధపెట్టడం చూడలేదు.. సరికదా వినలేదు కూడా. కాబట్టి ప్రస్తుతం జరిగే విషయాల గురించి నేను స్పష్టంగా చెప్పలేను" అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments