విజయ్ ఫౌండేషన్‌కు పెరుగుతున్న ఆదరణ
Send us your feedback to audioarticles@vaarta.com
యువతకు లక్ష ఉద్యోగాలు, మధ్యతరగతి వారికి నిత్యావసరాలు అందించడానికి హీరో విజయ్ దేవరకొండ రెండు పౌండేషన్స్ స్థాపించారు. అవే యువత కోసం ది దేవరకొండ ఫౌండేషన్(టీడీఎఫ్), మధ్యతరగతి వారి కోసం మిడిల్ క్లాస్ ఫౌండేషన్(ఎంసీఎఫ్). టీడీఎఫ్ కోసం కోటి రూపాయల నిధిని, మధ్యతరగతి వారికి పాతిక లక్షల రూపాయల నిధిని కేటాయించారు హీరో దేవరకొండ. ప్రస్తుతం తం మిడిల్ క్లాస్ ఫౌండేషన్‌కు సినీరంగం నుండి, బయట యువత నుండి మంచి ఆదరణ దక్కుతుంది. ఎంసీఎఫ్‌కు విరాళాలు అందుతున్నాయి.
తాజా సమాచారం ప్రకారం ఎంసీఎఫ్‌కు విజయ్ దేవరకొండ కేటాయించిన పాతిక లక్షలు కాకుండా మరో 18 లక్షల విరాళాలు అందాయి. దీంతో ఫౌండేషన్‌లో ఇప్పుడు రూ.43 లక్షలకు పైగా ఆదాయం చేరింది. ఇప్పటికే పాతిక కుటుంబాలకు పైగా విజయ్ దేరవకొండ అండ్ టీమ్ సాయాన్ని అందించింది. 8700పైగా సాయాన్ని అర్థిస్తూ వెబ్‌సైట్ ద్వారా రిక్వెస్ట్‌ను పంపారు. ఇకపై ప్రతిరోజూ సాయంత్రం తన ఎంసీఎఫ్‌కు సంబంధించిన అప్‌డేట్ ఇస్తానని విజయ్ దేవరకొండ తెలిపారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout