నిరుద్యోగులకు మరో శుభవార్త.. గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల..

  • IndiaGlitz, [Friday,December 08 2023]

ఏపీలో వరుసగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి. ఇప్పటికే గ్రూప్‌-2 నోటిఫికేషన్ విడుదల చేసిన ఏపీపీఎస్సీ(APPSC).. తాజాగా గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి కూడా నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 81 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు జనవరి 1 నుంచి జనవరి 21 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. మార్చి 17న ప్రిలిమినరీ పరీక్ష జరగనుంది. ఇందులో 9 డిప్యూటీ కలెక్టర్లు, 26 డీఎస్పీల పోస్టులు కూడా ఉన్నాయి.

కాగా గురువారం రాత్రి గ్రూప్-2 నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 897 గ్రూప్ -2 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఇందులో 331 ఎగ్జిక్యూటివ్ పోస్టులు, 566 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి. ఫిబ్రవరి 25 ప్రిలిమనరీ రాత పరీక్ష ఉంటుంది. ఆన్‌లైన్‌ దరఖాస్తులు డిసెంబర్ 21 నుంచి ప్రారంభం కానుండగా.. జనవరి 10 వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. స్క్రీనింగ్ పరీక్ష ఫిబ్రవరి 25న నిర్వహించనున్నారు. పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులను ఏపీపీఎస్సీ నిర్ణయించిన నిష్పత్తి ఆధారంగా మెయిన్స్‌కు షార్ట్ లిస్ట్ చేస్తారు. అనంతరం మెయిన్స్ పరీక్ష తేదీలను ప్రకటిస్తారు. మెయిన్స్ రాత పరీక్ష మెరిట్ ఆధారంగా అభ్యర్థులకు కంప్యూటర్ ప్రొఫిషియన్స్ పరీక్ష నిర్వహిస్తారు. స్క్రీనింగ్ పరీక్ష, మెయిన్ పరీక్ష రెండూ ఆఫ్‌లైన్ మోడ్‌లో నిర్వహిస్తారు.

కొత్త సిలబస్ ఆధారంగా గ్రూప్స్ పరీక్షలు ఉంటాయని APPSC ప్రకటించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు www.psc.ap.gov.in వెబ్‌సైట్‌లో చూడవచ్చు. ఈ నోటిఫికేషన్ల విడుదలతో ఎన్నోళ్లుగా గ్రూప్స్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల నిరీక్షణకు తెరపడినట్లైంది.

More News

MP Moitra:టీఎంసీ ఎంపీ మొయిత్రాపై బహిష్కరణ వేటు.. విపక్షాల ఆగ్రహం..

పశ్చిమబెంగాల్‌కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాపై బహిష్కరణ వేటు పడింది.

Chandrababu:తెలంగాణ ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

టీడీపీ అధినేత చంద్రబాబు తెలంగాణ ఎన్నికల ఫలితాలపై పరోక్షంగా స్పందించారు.

Akbaruddin Owaisi:తెలంగాణ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఒవైసీ

రేపటి(శనివారం) నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు మొదలుకానున్నాయి. దీంతో అసెంబ్లీ తొలి సమావేశాల ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ నియమితులయ్యారు.

Former CM KCR:మాజీ సీఎం కేసీఆర్‌కు సొంతింటి కష్టాలు.. ఎక్కడుండాలి..?

ఓడలు బండ్లు అవ్వడం.. బండ్లు ఓడలు అవ్వడం అంటే ఇదేనేమో. మొన్నటి వరకు సీఎం హోదాలో అధికార దర్పం ప్రదర్శించిన కేసీఆర్‌కు

KCR: కేసీఆర్ హెల్త్‌బులిటెన్ విడుదల.. ఏం చెప్పారంటే..?

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై యశోద ఆసుపత్రి వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.