నిరుద్యోగులకు మరో శుభవార్త.. గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల..
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీలో వరుసగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి. ఇప్పటికే గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల చేసిన ఏపీపీఎస్సీ(APPSC).. తాజాగా గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి కూడా నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 81 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు జనవరి 1 నుంచి జనవరి 21 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. మార్చి 17న ప్రిలిమినరీ పరీక్ష జరగనుంది. ఇందులో 9 డిప్యూటీ కలెక్టర్లు, 26 డీఎస్పీల పోస్టులు కూడా ఉన్నాయి.
కాగా గురువారం రాత్రి గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 897 గ్రూప్ -2 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఇందులో 331 ఎగ్జిక్యూటివ్ పోస్టులు, 566 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి. ఫిబ్రవరి 25 ప్రిలిమనరీ రాత పరీక్ష ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తులు డిసెంబర్ 21 నుంచి ప్రారంభం కానుండగా.. జనవరి 10 వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. స్క్రీనింగ్ పరీక్ష ఫిబ్రవరి 25న నిర్వహించనున్నారు. పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులను ఏపీపీఎస్సీ నిర్ణయించిన నిష్పత్తి ఆధారంగా మెయిన్స్‌కు షార్ట్ లిస్ట్ చేస్తారు. అనంతరం మెయిన్స్ పరీక్ష తేదీలను ప్రకటిస్తారు. మెయిన్స్ రాత పరీక్ష మెరిట్ ఆధారంగా అభ్యర్థులకు కంప్యూటర్ ప్రొఫిషియన్స్ పరీక్ష నిర్వహిస్తారు. స్క్రీనింగ్ పరీక్ష, మెయిన్ పరీక్ష రెండూ ఆఫ్‌లైన్ మోడ్‌లో నిర్వహిస్తారు.
కొత్త సిలబస్ ఆధారంగా గ్రూప్స్ పరీక్షలు ఉంటాయని APPSC ప్రకటించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు www.psc.ap.gov.in వెబ్‌సైట్‌లో చూడవచ్చు. ఈ నోటిఫికేషన్ల విడుదలతో ఎన్నోళ్లుగా గ్రూప్స్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల నిరీక్షణకు తెరపడినట్లైంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout