హగ్, కిస్, ఫైట్స్ లేకుండా షూటింగ్స్‌కు ఓకే..!
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా నేపథ్యంలో సినిమా షూటింగ్స్, రిలీజ్‌లు, థియేటర్స్ మూసివేయడంతో ఇండస్ట్రీకి ఏ రేంజ్‌లో నష్టం వాటిల్లిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. షూటింగ్స్ త్వరలోనే ప్రారంభించుకోవచ్చు ఇప్పటికే దాదాపు అన్ని రాష్ట్రాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి కానీ.. జూన్ నుంచి మళ్లీ లాక్ డౌన్ 5.0 విధించడంతో మళ్లీ సీన్ మొదటికొచ్చింది. అయితే షూటింగ్స్‌పై మహారాష్ట్ర ప్రభుత్వం అసలు షూటింగ్స్ ఎలా చేసుకోవాలి..? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? ఏమేం షూటింగ్స్ చేయాలి..? ఏమేం చేయకూడదు...? అనే విషయాలపై నిశితంగా ఆలోచించిన మహా సర్కార్.. బాలీవుడ్ సినిమాలు, సీరియల్స్, యాడ్ షూటింగ్స్‌కు అనుమతినిస్తున్నట్లు ప్రకటించింది.
ఇలా చేయాల్సిందే..!
షూటింగ్స్ జరిగే చోట తప్పకుండా అందరూ భౌతిక దూరం పాటించాలి.
షూటింగ్ జరిపే ప్రదేశాలను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేస్తుండాలి.
నటీనటులు మేకప్‌మెన్‌లను పెట్టుకోకుండా సొంతంగానే మేకప్‌లు వేసుకోవాలి.
ఇక షూటింగ్‌లో ముద్దులు, కౌగిలింతలు నిషేధం.
మరీ ముఖ్యంగా ఫైట్ సన్నివేశాలు కూడా ఇప్పుడు నివారించాలి.
కిస్, హగ్, ఫైట్స్‌కు ఇప్పట్లో అవకాశం లేదు.
పెళ్లి సన్నివేశాలు, మార్కెట్ తరహా రద్దీగా కనిపించే సీన్స్‌కు కూడా అనుమతి లేదు
షూటింగ్స్ జరుపుకోవాలంటే ఆయా జిల్లాకు చెందిన కలెక్టర్లకు దరఖాస్తు చేసుకోవాలి
సినిమా సెట్స్, ఎడిటింగ్ స్టూడియోల్లో ఎక్కువ మంది ఉండకుండా భౌతిక దూరం పాటించాలి
ఎప్పటి నుంచి షూటిగ్ ప్రారంభించాలి..? అనేదానిపై తేదీని ప్రకటించాలని మహా సర్కార్ నిశితంగా మార్గదర్శకాల్లో పేర్కొంది.
కాగా.. సినిమా అంటే లవ్, రొమాన్స్, ఫైటింగ్స్ అనేవి కంపల్సరీ. మరీ ఈ మూడే లేకుండా సినిమా ఎలా సాధ్యం అవుతుందనేది ఇప్పుడు దర్శకనిర్మాతలు పెద్ద తలనొప్పిగా మారింది. బాలీవుడ్‌కు ఎలాగో అనుమతి వచ్చేసింది. మరి ఈ టైమ్‌లో పైన నిబంధనలన్నీ పాటిస్తూ ఏ మాత్రం సినిమా తీయగలరో అనేది తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడక తప్పదు మరి. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లోనూ పరిస్థితులు అలానే ఉన్నాయి. త్వరలోనే ఇందుకు సంబంధించి మార్గదర్శకాలు రాబోతున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout