'గ్రీన్ కార్డ్ ' పాటలు విడుదల

  • IndiaGlitz, [Wednesday,May 10 2017]

అమెరికా త‌ర‌హాలో ఇండియాలో కూడా తుపాల‌కు సంస్కృతి పెరిగిపోయింది. అలాగే అమెరికాకు త‌మ పిల్ల‌ల‌ను పంపాల‌నుకునే త‌ల్లిదండ్రులంద‌రూ ఈ సినిమాను చూడాలని అన్నారు ద‌ర్శ‌కుడు ర‌మ్స్‌(యు.ఎస్‌.ఎ). మాస్ట‌ర్ దేవాన్ష్ స‌మ‌ర్ప‌ణ‌లో సింహ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై శ‌తృఘ్న రాయ‌పాటి(యు.ఎస్‌.ఎ),స్టెఫానీ(యు.ఎస్‌.ఎ), జోసెలిన్‌(యు.ఎస్‌.ఎ) తారాగ‌ణంగా ర‌మ్స్ (యు.ఎస్‌.ఎ) ద‌ర్శ‌క‌త్వంలో శ్రీనివాస్ గుప్తా(యు.ఎస్‌.ఎ), మోహ‌న్‌.ఆర్‌(యు.ఎస్‌.ఎ), న‌ర‌సింహ‌, నాగ‌శ్రీనివాస‌రెడ్డి నిర్మాత‌లుగా రూపొందుతోన్న చిత్రం 'గ్రీన్‌కార్డ్‌'. ఈ సినిమా పాట‌ల విడుద‌ల కార్య‌క్ర‌మం మంగ‌ళ‌వారం హైద‌రాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో సీనియ‌ర్ న‌టుడు చ‌ల‌ప‌తిరావు, ద‌ర్శ‌కుడు ర‌మ్స్‌, అనిత‌, రాగిణి, అభి త‌దిత‌రులు పాల్గొన్నారు.

వీసా తీసుకుని అమెరికా చేరుకున్న ఓ కుర్రాడి క‌థే గ్రీన్‌కార్డ్‌. గ‌త 15 సంవ‌త్స‌రాలుగా నేను అమెరికాలో గ‌మ‌నించిన ప‌రిస్థితుల‌ను ఆధారంగా చేసుకుని ఈ క‌థ‌ను త‌యారుచేసుకున్నాను. పిల్ల‌ల‌ను అమెరికాకు పంపాల‌నుకునే త‌ల్లిదండ్రులు చూడాల్సిన సినిమా ఇది. 90 శాతం సినిమాను అమెరికాలోనే చిత్రీక‌రించాను. నా నెక్ట్స్ మూవీని ఇండియాలోనే చిత్రీక‌రిస్తాను. ఆ సినిమా టైటిల్ 'ఈరోజు నీతో'. గ్రీన్ కార్డ్ సినిమా ఆడియో విడుద‌ల‌ను అమెరికాలో కూడా చేశాం. సినిమా అంతా స‌ర‌దాగా సాగిపోతుంది. లైఫ్ ఇన్ అమెరికాను, అమెరికాలో ఉన్న వారికి కూడా తెలియ‌ని చాలా విష‌యాల‌ను ఇందులో చూపించ‌బోతున్నాం. అలాగే ఇండియాలో కూడా అమెరికాలాగానే గ‌న్ క‌ల్చ‌ర్ వ‌చ్చేసింది. ఆ క‌ల్చ‌ర్ పోవాల‌ని కూడా ఈ సినిమాలో చూపించ‌బోతున్నానని ద‌ర్శ‌కుడు ర‌మ్స్ ఈ సంద‌ర్భంగా తెలియ‌జేశారు.

'గ్రీన్ కార్డ్' సినిమా తొంబై శాతం అమెరికాలోనే చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంది. ఇక్క‌డ నుండి అమెరికాకు వెళ్ళే వారు గ్రీన్‌కార్డ్ కోసం ఎన్ని తిప్పులు ప‌డ‌తార‌నే కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందించ‌బ‌డింది. సినిమాలో నేను హీరో తండ్రి పాత్ర‌లో న‌టించాను. ప్ర‌ణ‌య్‌కుమార్ మంచి సాంగ్‌ను రాశారు. సినిమా త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ప్రేక్ష‌కులు సినిమాను ఆద‌రిస్తార‌ని న‌మ్మ‌తున్నానని న‌టుడు చ‌ల‌ప‌తిరావు అన్నారు.

శ‌తృఘ్న రాయ‌పాటి(యు.ఎస్‌.ఎ),స్టెఫానీ(యు.ఎస్‌.ఎ), జోసెలిన్‌(యు.ఎస్‌.ఎ), రెబెకా(యు.ఎస్‌.ఎ), మిల్లి(యు.ఎస్‌.ఎ), స్వీటెన్ (యు.ఎస్‌.ఎ) త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి సంగీతంః కు(యు.ఎస్‌.ఎ), హెన్నీ ప్రిన్స్‌, ప్ర‌ణ‌య్‌కుమార్‌, కెమెరాః న‌వీన్‌(యు.ఎస్‌.ఎ), నాగ‌శ్రీనివాస్‌రెడ్డి, ఎడిటింగ్ః మోహ‌న్‌, రామారావు, నిర్మాత‌లుః శ్రీనివాస్ గుప్తా(యు.ఎస్‌.ఎ), మోహ‌న్‌.ఆర్‌(యు.ఎస్‌.ఎ), న‌ర‌సింహ‌, నాగ‌శ్రీనివాస‌రెడ్డి, ద‌ర్శ‌క‌త్వంః ర‌మ్స్ (యు.ఎస్‌.ఎ).