'ఆర్ఆర్ఆర్' క్లైమాక్స్‌లో అదిరిపోయే ట్విస్ట్..!
Send us your feedback to audioarticles@vaarta.com
పిరియాడిక్ మూవీస్‌కి ఉండే క్రేజే వేరు. అందుకే చిరంజీవి నుంచి మెగా ఫ్యామిలీ మొత్తం పిరియాడిక్ మూవీస్‌ను ఎంచుకుంటోంది. భారీ బడ్జెట్‌తో మంచి ఎఫెక్ట్స్‌తో ప్రేక్షకులకు ఐ ఫీస్ట్‌గా అందిస్తున్నారు. ఇక దర్శకధీరుడు రాజమౌళి సినిమా అయితే చెప్పనక్కర్లేదు. మనల్ని మరో లోకంలోకి తీసుకెళతారు. అలాంటి దర్శకధీరుడు అటు నందమూరి హీరో.. ఇటు మెగా హీరోతో సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇద్దరి అభిమానులనూ జక్కన్న టార్గెట్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త వైరల్ అవుతోంది.
దర్శక ధీరుడు రాజమౌళి కూడా ఆర్ఆర్ఆర్ సినిమా క్లైమాక్స్‌ను విభిన్నంగా ప్లాన్ చేస్తున్నాడట. ఈ సినిమాలో కొమురం భీమ్ పాత్రలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్ నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ స్టోరీకి కాస్త క్రియేటివిటీని జోడించి ఓ కల్పిత కథలా జక్కన్న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ క్రమంలోనే క్లైమాక్స్‌లో అదిరిపోయే ట్విస్ట్ ఉండబోతోందని సమాచారం. దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఇరు హీరోల వీరి పోరాట సన్నివేశాల్లో భారీ ట్విస్టు ఉండబోతోందని తెలుస్తోంది.
కొమురం భీమ్, అల్లూరి సీతారామరాజుల్లో ఒకరికి కళ్లు పోతే, మరొకరికి కాళ్లు పోతాయని తెలుస్తోంది. అయితే వీళ్లిద్దరూ అంగవైకల్యాన్ని ఏమాత్రం లెక్కచేయకుండా పోరుబాటలో ముందడుగు వేస్తారట. కాళ్లు కోల్పోయిన హీరోను రెండో హీరో తన భుజాలపై ఎత్తుకోగా ఈ ఇద్దరూ శత్రువులను చీల్చి చెండాడుతారని సమాచారం. మరి ఇదే క్లైమాక్స్ ఆర్‌ఆర్‌ఆర్‌లో ఉండబోతుందా? లేదా ఏమైనా మార్పులు చేర్పులు చేస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది. అజయ్ దేవ్‌గణ్, శ్రియ, అలియా భట్, ఒలీవియా మోరిస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 13న విడుదల కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments