గ్రాఫిక్స్ హైలెట్ గా అరుంధతి అమావాస్య
Send us your feedback to audioarticles@vaarta.com
కె వంశీధర్ సమర్పణలో మిస్ కర్ణాటక అర్చన మసలి ముఖ్య పాత్రలో తోట కృష్ణ దర్శకత్వంలో, శ్రీ కృష్ణ శంకర్ ప్రొడక్షన్స్ పతాకం పై కనమర్లపూడి కోటేశ్వరరావు నిర్మిస్తున్న చిత్రం ''అరుంధతి అమావాస్య''. కె విద్యారాణి సహా నిర్మాత. ఇప్పటికే షూటింగ్ పూర్తీ చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం గ్రాఫిక్స్ వర్క్స్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. త్వరలో విడుదల చేయడానికి సిద్ధం అవుతున్న నేపథ్యంలో ...
దర్శకుడు తోట కృష్ణ వివరాలు తెలియచేస్తూ .. అరుంధతికి అఘోరకు మధ్య జరిగే పోరాటం నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. ఈ సినిమాలో ఓ పాము ప్రధాన పాత్ర పోషిస్తుంది. అమావాస్య రోజున ముగిసే ఈ పోరాటంలో ఎన్నో మలుపులు ఉంటాయి. గ్రాఫిక్స్ ప్రధాన హైలెట్ గా నిలుస్తాయి.
అమ్మోరు, అరుంధతి తరహాలో ఉండే గ్రాఫిక్స్ ప్రేక్షకులకు కొత్త ఫీల్ కలిగిస్తాయి. ఈ చిత్రం షూటింగ్ హైద్రాబాద్, నిజామాబాద్ తదితర ప్రాంతాల్లో చిత్రీకరించాము. డిచ్ పల్లి లో పదికోట్ల భారీ బంగళాలో చిత్రీకరించిన సన్నివేశాలు హైలెట్ గా నిలుస్తాయి. ఆద్యంతం ఆసక్తికరంగా సాగే కథలో కామెడీ, ఎమోషన్ ప్రేక్షకులకు నచ్చే అంశాలు అన్నారు.
నిర్మాత కోటేశ్వర రావు మాట్లాడుతూ .. షూటింగ్ పూర్తయింది. దాంతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని మొదటి కాపీ సిద్ధం అయింది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించాడు. ఈ సినిమాలోని గ్రాఫిక్స్ ప్రేక్షకులను అబ్బురపరుస్తాయి. అన్ని రకాల కమర్షియల్ అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఏప్రిల్ చివరివారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అన్నారు .
బేబీ కీర్తన, షకీలా, నిహారిక,తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం : ఘనశ్యామ్ , ఎడిటింగ్ : రంజిత్ కళ్యాణ్, కెమెరా : ఎం ఎస్ గౌడ్, పాటలు : బాబ్జీ , నిర్మాత : కనమర్లపూడి కోటేశ్వర రావు, స్టోరీ, స్క్రీన్ ప్లే - దర్శకత్వం : తోట కృష్ణ.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments