గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నాగార్జున...

  • IndiaGlitz, [Saturday,June 18 2016]

గౌత‌మ్ మీన‌న్ సినిమాలు రొటీన్ కి భిన్నంగా వెరైటీగా ఉంటాయ‌న్న విష‌యం తెలిసిందే. అందుకే గౌత‌మ్ మీన‌న్ ద‌ర్శ‌కత్వంలో న‌టించాలి అనుకుంటారు. నాగార్జున కూడా అలాగే అనుకున్నారు. గౌత‌మ్... నాతో ఓ మూవీ చేయ‌మ‌ని నాగ్ అడిగార‌ట. ఆత‌ర్వాత నెగిటివ్ రోల్ చేస్తారా అని నాగ్ ని గౌత‌మ్ అడిగార‌ట‌. నాగ్ ఓకే చేస్తాను అని చెప్పినా కూడా ఎందుక‌నో మ‌ళ్లీ గౌత‌మ్ మీన‌న్ నాగ్ ని క‌ల‌వ‌లేద‌ట‌.
ఈ విష‌యాన్ని నాగ్ స్వ‌యంగా సాహ‌సం శ్వాస‌గా సాగిపో ఆడియో వేడుక‌లో చెప్పారు. గౌత‌మ్ నాతో సినిమా చేయ‌క‌పోయినా చైత‌న్య‌తో సినిమాలు చేస్తున్నందుకు సంతోషంగా ఉంది అన్నారు. నేనేంటి గౌత‌మ్ మీన‌న్ ని నాతో సినిమా చెయ్ అని అడ‌గ‌డం ఏమిటి..? అని ఆలోచించ‌రు. నాగార్జున త‌న మ‌న‌సులో ఏముంటే అది చేస్తారు.. అదే అంద‌రి ముందు చెబుతారు. ఏమాత్రం ఈగో లేకుండా ఇలా మాట్లాడ‌డం నిజంగా నాగార్జున‌కే సొంతం.నాగ్ కోరుకున్న‌ట్టుగా.. త్వ‌ర‌లోనే గౌత‌మ్ మీన‌న్ - నాగార్జ‌న కాంబినేష‌న్లో మూవీ వ‌స్తుంద‌ని ఆశిద్దాం.