హ్యాట్రిక్ కోసం గౌతమ్ మీనన్ రెడీ...

  • IndiaGlitz, [Saturday,June 18 2016]

ఏ మాయ చేసావే సినిమాతో నాగ‌చైత‌న్య‌ను ల‌వ‌ర్ బోయ్‌గా మార్చ‌డ‌మే కాకుండా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ను అందించాడు ద‌ర్శ‌కుడు గౌత‌మ్‌మీన‌న్‌. చైతులో అప్పుడు ల‌వ్ స‌బ్జెక్ట్‌ను డైరెక్ట్ చేసిన గౌతంమీన‌న్ ఇప్పుడు ల‌వ్, యాక్ష‌న్‌ను క‌లిపి సాహసం శ్వాస‌గా సాగిపో అనే సినిమాను తీశాడు. ఈ చిత్రం ద్వారా మంజిమ మోహ‌న్‌ను హీరోయిన్‌గా ప‌రిచ‌యం చేస్తున్నాడు.

ఈ సినిమా జూలై విడుద‌ల‌వుతుంది. అయితే గౌత‌మ్‌మీన‌న్ ఇప్పుడు చైత‌న్య‌తో మ‌రో సినిమా చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాడ‌ట‌. ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా చెప్పుకొచ్చాడు. హ్యాట్రిక్ చిత్ర క‌థ‌ను ఇప్ప‌టికే 80 శాతం పూర్తి చేసేశాడ‌ట‌. చైత‌న్య చేయ‌డానికొ ఒప్పుకుంటే త‌న‌కు చైతుతో సినిమా చేయ‌డానికి అభ్యంత‌రం లేద‌ని చెప్పుకొచ్చాడు. మ‌రి చైత‌న్య మూడోసారి గౌత‌మ్‌మీన‌న్ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తాడంటారా..